ప్రయాణికులకు అలర్ట్ - చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైళ్లు రీషెడ్యూల్, మార్పులు ఇలా

పెయిరింగ్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, చర్లపల్లి నుంచి బయలుదేరే షాలిమార్, తిరువనంతపురం నార్త్, రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేసింది.

Published on: Nov 23, 2026, 20:46:42 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. పెయిరింగ్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి బయలుదేరే మూడు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణించాల్సిన ప్రయాణికులు మారిన సమయాలను గమనించి…. అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్
రైల్వే ప్రయాణికులకు అలర్ట్

ఈ రైళ్లు రీషెడ్యూల్ - లిస్ట్

  • చర్లపల్లి - రక్సాల్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 05532) : ఈ రోజు అంటే నవంబర్ 23, 2026 రాత్రి 10.00 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరాల్సిన చర్లపల్లి - రక్సాల్ ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు 12 గంటలు ఆలస్యంగా నడవనుంది. ఈ రైలు నవంబర్ 24, 2026 ఉదయం 10.00 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది.
  • చర్లపల్లి - షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 17065) : నవంబర్ 24, 2026 ఉదయం 06.55 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరాల్సిన షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాన్ని 9 గంటల పాటు మార్చారు. ఈ రైలు అదే రోజు మధ్యాహ్నం 03.55 గంటలకు చర్లపల్లి నుంచి ప్రయాణమవుతుంది.
  • చర్లపల్లి - తిరువనంతపురం నార్త్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 17041) : నవంబర్ 24, 2026 ఉదయం 07.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరాల్సిన చర్లపల్లి - తిరువనంతపురం నార్త్ ఎక్స్‌ప్రెస్ రైలు 13 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ రైలు రేపు రాత్రి 08.15 గంటలకు చర్లపల్లి టెర్మినల్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులతో పాటు ఇతరులు మారిన టైమింగ్స్ ను సరిచూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.