పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - విశాఖపట్నం, హెచ్.ఎస్. నాందేడ్ - పానిపట్ మార్గాల్లో ఈ ప్రత్యేక సేవలను అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
చర్లపల్లి – విశాఖపట్నం స్పెషల్ ట్రైన్

చర్లపల్లి – విశాఖపట్నం ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07067) 15.10.2026(గురువారం) 1 సర్వీసు నడుస్తుంది. చర్లపల్లిలో రాత్రి 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం – చర్లపల్లి ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07068) 16.10.2026 (శుక్రవారం) 1 సర్వీసు ఉంటుంది. విశాఖపట్నంలో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి.
నాందేడ్ – పానిపట్ ప్రత్యేక రైలు
హెచ్.ఎస్. నాందేడ్ - పానిపట్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07635) 21.10.2026, 27.10.2026 మొత్తం 2 సర్వీసులు నడుస్తాయి. నాందేడ్లో ఉదయం 07:40 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు పానిపట్ చేరుకుంటుంది.
పానిపట్ – హెచ్.ఎస్. నాందేడ్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07636) 22.10.2026, 28.10.2026 2 సర్వీసులు ఉంటాయి. పానిపట్లో సాయంత్రం 6:15 గంటలకు బయలుదేరి, రెండో రోజు ఉదయం 6:00 గంటలకు హెచ్.ఎస్. నాందేడ్ చేరుకుంటుంది.
స్టాపేజీలు చూసుకుంటే.. పూర్ణా, పర్భణి, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్, మన్మాడ్, జల్గావ్, భూసావల్, ఖాండ్వా, ఇటార్సీ, రాణి కమలాపతి, బీనా, వి.ఎల్. ఝాన్సీ, ఆగ్రా కాంట్, మథుర, కోసి కలాన్, న్యూఢిల్లీ, భోద్వాల్ మజ్రీ స్టేషన్లలో ఇరువైపులా నిలుస్తాయి. 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు కేటాయించారు.
పలు రైళ్లు రద్దు
{{/usCountry}}స్టాపేజీలు చూసుకుంటే.. పూర్ణా, పర్భణి, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్, మన్మాడ్, జల్గావ్, భూసావల్, ఖాండ్వా, ఇటార్సీ, రాణి కమలాపతి, బీనా, వి.ఎల్. ఝాన్సీ, ఆగ్రా కాంట్, మథుర, కోసి కలాన్, న్యూఢిల్లీ, భోద్వాల్ మజ్రీ స్టేషన్లలో ఇరువైపులా నిలుస్తాయి. 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు కేటాయించారు.
పలు రైళ్లు రద్దు
{{/usCountry}}ఝార్సుగూడ రైల్వే స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణ పనుల నిమిత్తం నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ సాంకేతిక అభివృద్ధి పనుల కారణంగా పలు కీలక ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారిమళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకునే ముందు రద్దయిన, దారిమళ్లించిన రైళ్ల జాబితాను పరిశీలించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
రద్దయిన రైళ్ల వివరాలు
చర్లపల్లి – దర్భంగా (రైలు సంఖ్య: 17007) 2026 నవంబర్ 28, డిసెంబర్ 05, డిసెంబర్ 08, డిసెంబర్ 12వ తేదీల్లో రద్దైంది. దర్భంగా-చర్లపల్లి(రైలు సంఖ్య: 17008) 2026 డిసెంబర్ 01, డిసెంబర్ 08, డిసెంబర్ 11, డిసెంబర్ 15 తేదీల్లో రద్దైంది.
హెచ్.ఎస్. నాందేడ్ – సంత్రాగాచి (రైలు సంఖ్య: 12767) 2026 నవంబర్ 23, నవంబర్ 30, డిసెంబర్ 07, డిసెంబర్ 14, డిసెంబర్ 21, డిసెంబర్ 28, 2027 జనవరి 04, జనవరి 11 తేదీల్లో రద్దు అవుతుంది. సంత్రాగాచి – హెచ్.ఎస్. నాందేడ్ (రైలు సంఖ్య: 12768) 2026 నవంబర్ 25, డిసెంబర్ 02, డిసెంబర్ 09, డిసెంబర్ 16, డిసెంబర్ 23, డిసెంబర్ 30, 2027 జనవరి 06, జనవరి 13 తేదీల్లో రద్దు చేస్తారు.
దారిమళ్లించిన రైలు
యశ్వంత్పూర్ – తాతానగర్(రైలు సంఖ్య: 18112) 2026 డిసెంబర్ 13న బయలుదేరే సర్వీసు సాధారణ మార్గానికి బదులుగా విజయనగరం - ఇచ్చాపురం - జఖపుర - నయాగఢ్ - దస్పల్లా మీదుగా మళ్లిస్తారు.