...
...
Next Story

గణేష్ నిమజ్జన కోసం సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో జరిగే గణేష్ విగ్రహ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 25-26, 26-27 తేదీలలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతుంది.

Published on: Sep 23, 2026, 15:05:22 IST
Advertisement

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో నవరాత్రుల పాటు పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ చెరువుల వద్దకు చేరుకుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిమజ్జన శోభాయాత్రలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.

ఎంఎంటీఎస్
ఎంఎంటీఎస్

ఈ నేపథ్యంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జనం రోజుల్లో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ (MMTS) రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబరు 25-26, సెప్టెంబరు 26-27 తేదీల మధ్య రాత్రి 11:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 05:00 గంటల వరకు ఈ ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), లింగంపల్లి, ఫలక్‌నుమా వంటి కీలకమైన మార్గాలను కవర్ చేస్తూ ఈ సర్వీసులను నడుపుతారు.

సికింద్రాబాద్ - హైదరాబాద్: రాత్రి 11:50 గంటలకు బయలుదేరుతుంది.

హైదరాబాద్ - లింగంపల్లి: అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరుతుంది.

లింగంపల్లి - హైదరాబాద్: రాత్రి 01:50 గంటలకు బయలుదేరుతుంది.

హైదరాబాద్ - సికింద్రాబాద్: తెల్లవారుజామున 03:30 గంటలకు బయలుదేరుతుంది.

హైదరాబాద్ - లింగంపల్లి: రాత్రి 11:10 గంటలకు బయలుదేరుతుంది.

లింగంపల్లి - ఫలక్‌నుమా: అర్ధరాత్రి 12:10 గంటలకు బయలుదేరుతుంది.

ఫలక్‌నుమా - సికింద్రాబాద్: రాత్రి 02:20 గంటలకు బయలుదేరుతుంది.

ఈ ప్రత్యేక MMTS రైళ్లు ఆయా మార్గాల్లో ఉన్న అన్ని సాధారణ ఎమ్‌ఎమ్‌టీఎస్ స్టేషన్లలోనూ ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీనివల్ల నగరంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చే భక్తులైనా సరే.. తమకు సమీపంలో ఉన్న స్టేషన్‌లో రైలు ఎక్కడానికి లేదా దిగడానికి సులభంగా ఉంటుంది.

సాధారణంగా గణేశ్ నిమజ్జనం సమయంలో ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సొంత వాహనాలు లేదా ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించడం కష్టతరంగా మారుతుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసులు భక్తులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks