హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు.... సర్వీసుల వివరాలివే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

Published on: Jun 27, 2025, 16:04:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్స్…. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లల్లో ఆగుతాయని పేర్కొంది.

సౌత్ సెంట్రల్ రైల్వే - ప్రత్యేక రైళ్లు
సౌత్ సెంట్రల్ రైల్వే - ప్రత్యేక రైళ్లు

8 ప్రత్యేక రైళ్లు…

దక్షిణ మధ్య రైల్వేవెల్లడించిన వివరాల ప్రకారం…హైదరాబాద్ - కన్యాకుమారి (ట్రైన్ నెంబర్ 07230) మధ్య 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జూలై 2 నుంచి జూలై 23వ తేదీల మధ్య వారంలో ఒకసారి రాకపోకలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైలు(07230) జూలై 2న (బుధవారం) సాయంత్రం 5.20 గంటలకు బయల్జేరుతుంది. శుక్రవారం ఉదయం 2.30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.

ఇక కన్యాకుమారి - హైదరాబాద్ మధ్య మరో 4 రైళ్లు(ట్రైన్ నెంబర్ 07229) సర్వీసులు ఉంటాయి. ఈ ట్రైన్ కన్యాకుమారి నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 03.15 గంటలకు బయల్దేరుతుంది. శనివారం ఉదయం 2.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. జూలై 4 నుంచి జూలై 25 తేదీల మధ్య ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.

ఆగే స్టేషన్లు ఇవే…

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, చిదంబరం, కుంభకోణం, తంజావురు, కొడైకెనల్, మధురై, కొవిలిపట్టి, నాగర్ సోల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వేఅధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More