...
...
Next Story

SCR Special Trains : ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు

SCR Special Trains : ఆషాఢ ఏకాదశి సందర్భంగా పలు రూట్‌లలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్లను నడుపుతోంది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది.

Published on: Jul 14, 2026, 22:14:07 IST
Advertisement

ఆషాఢ ఏకాదశి వేడుకల సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఏయే రూట్‌లలో రైళ్లు నడుస్తాయో చూడండి.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

07631 నాగర్‌సోల్-పండర్పూర్ ట్రైన్ 24.07.2026 నడుస్తుంది. 07632 రైలు పండర్‌పూర్ - జల్నా 25.07.2026వ తేదీ ఉంది. 24.07.2026వ తేదీన 07633 ఆదిలాబాద్ - మిరాజ్ ట్రైన్ ఉండగా.. 07634 మిరాజ్ - ఆదిలాబాద్ 25.07.2026వ తేదీన నడుస్తుంది. 07635 అకోలా - పండర్‌పూర్ 24.07.2026వ తేదీ ఉంది. 07636 పండర్‌పూర్ -అకోలా 25.07.2026వ తేదీన షెడ్యూల్ చేసింది రైల్వే శాఖ. ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయో చూడండి.

07631/07632 నాగర్‌సోల్ – పండర్పూర్ – జల్నా ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు రోటేగావ్, లాసూర్, ఛత్రపతి శంభాజీనగర్, జల్నా, పర్తుర్, సేలు, మాన్వత్ రోడ్, పర్భాని, గంగాఖేర్, పర్లీ వైజనాథ్, లాతూర్ రోడ్, లాతూర్, హారంగుల్, ఔసా రోడ్, మురుద్, హారంగుల్, ఔసా రోడ్, మురుద్, డోకి, కలాంబ్, యెడ్షి, ధారశివ్, పంగ్రి, బర్సి టౌన్, షెంద్రి, కుర్దువాడి, మోడ్నింబ్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

07633/07634 ఆదిలాబాద్ – మిరాజ్ – ఆదిలాబాద్ ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు కిన్వాట్, బోధడి బుజుర్గ్, సహస్రకుండ్, హిమాయత్‌నగర్, భోకర్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ జంక్షన్, పర్భాని, గంగాఖేర్, పర్లి వైజనాథ్, లాతూర్, హారంగుల్, ఔసా రోడ్, ధారశివ్, పాంగ్రి, బర్సీ టౌన్, కుర్దువాడి, మోడ్‌నింబ్‌డివా, పండర్పూర్, సంగోలా, జాత్ రోడ్, కవాతే మహాంకాళ్, ఆరగ్ స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలోనూ 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

07505/07506 అకోలా - పండర్పూర్ - అకోలా ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు వాషిమ్, హింగోలి, బాస్మత్, పూర్ణ, పర్భాని, గంగాఖేర్, పర్లీ వైజనాథ్, పంగావ్, లాతూర్ రోడ్, ఉద్గీర్, భాల్కీ, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూర్, సెరం, చిత్తాపూర్, వాడి, కలబురగి, షోలాపూర్, కుర్దువాడి స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe