Tata Sierra EV : హైదరాబాద్​లో టాటా సియెర్రా ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Tata Sierra EV on road price in Hyderabad : ఇటీవలే లాంచ్​ అయిన టాటా సియెర్రా ఈవీకి మంచి క్రేజ్​ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. హైదరాబాద్​లో టాటా సియెర్రా ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 9, 2026, 11:14:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tata Sierra EV price : 2026లో బిగ్గెస్ట్​ లాంచ్​గా నిలిచిన టాటా సియెర్రా ఈవీని మీరు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో టాటా సియెర్రా ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఈవీ..
టాటా సియెర్రా ఈవీ..

హైదరాబాద్​లో టాటా సియెర్రా ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్..

టాటా సియెర్రా ఈవీ ప్యూర్​ 63 ఆర్​డబ్ల్యూడీ- రూ. 19.76 లక్షలు

ప్యూర్ ఎస్ 63 ఆర్​డబ్ల్యూడీ- రూ. 21.01 లక్షలు

అడ్వెంచర్ 63 ఆర్​డబ్ల్యూడీ- రూ. 22.06 లక్షలు

అడ్వెంచర్ 75 ఆర్​డబ్ల్యూడీ- రూ. 23.49 లక్షలు

ఎంపవర్డ్ 63 ఆర్​డబ్ల్యూడీ- రూ. 23.94 లక్షలు

ఎంపవర్డ్ 75 ఆర్​డబ్ల్యూడీ- రూ. 25.17 లక్షలు

ఎంపవర్డ్ ఏ 75 ఆర్​డబ్ల్యూడీ- రూ .26.22 లక్షలు

ఎంపవర్డ్​ ఏ 75 క్యూడబ్ల్యూడీ- రూ. 27.47 లక్షలు.

అంటే.. హైదరాబాద్​లో టాటా సియెర్రా ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 19.76లక్షల నుంచి రూ. 27.47 లక్షల వరకు ఉంటుందని అర్థం.

సాధారణంగా ఒక కారును లాంచ్​ చేస్తున్నప్పుడు ఆటోమొబైల్​ సంస్థలు.. దాని ఎక్స్​షోరూం ధరలను మాత్రమే రివీల్​ చేస్తాయి. కానీ ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది ఎక్స్​షోరూం ధర కన్నా ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్సులు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం.

అందుకే ఏదైనా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. దాని ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలతో పాటు ఆఫర్లు, డిస్కౌంట్లు, టెస్ట్ డ్రైవ్​ వంటివి తెలుసుకోవచ్చు.

టాటా సియెర్రా ఈవీ- బ్యాటరీ, డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లు..

టాటా సియెర్రా ఈవీలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 63 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రెండు బ్యాటరీ ఆప్షన్లను అందించారు. ఇవి రెండు రకాల డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్స్‌తో వస్తాయి.

63 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది కేవలం రియర్-వీల్-డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ) సెటప్‌తో మాత్రమే లభిస్తుంది.

75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది రియర్-వీల్-డ్రైవ్, పవర్‌ఫుల్ క్వాడ్-వీల్-డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

వేరియంట్లు, బ్యాటరీ బట్టి టాటా సియెర్రా ఈవీ రియల్​ వరల్డ్ రేంజ్ 460 కి.మీ నుంచి 500 కి.మీ వరకు ఉంటుంది.

టాటా సియెర్రా ఈవీ వేరియంట్ల వారీగా ఫీచర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా సియెర్రా ఈవీ- ఛార్జింగ్ టైమ్..

టాటా సియెర్రా ఈవీలోని 2 బ్యాటరీలు కూడా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. 63 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 25 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. పెద్దదైన 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 20% నుంచి 80% ఛార్జింగ్ స్థాయిని చేరుకోవడానికి దాదాపు 26 నిమిషాల సమయం తీసుకుంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More