Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ కొంటున్నారా? ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్లు, వాటి ఫీచర్లు ఇవి..
Tata Sierra EV variants : టాటా సియెర్రా ఈవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! ఈ సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని వేరియంట్లు, వాటి ఫీచర్లు సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారతదేశ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, తన సరికొత్త 'టాటా సియెర్రా ఈవీ'ని రూ. 18.79 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశీయ ఈవీ మార్కెట్లో సింహభాగాన్ని సొంతం చేసుకున్న టాటా.. టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ లైనప్‌లోకి ఇప్పుడు సియెర్రా ఈవీని కూడా చేర్చింది. 63 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్లతో, గరిష్టంగా 665 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ కారు మొత్తం 7 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది.

కంపెనీ ఈ కారును కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా 6 వేరియంట్లు లేదా 'పర్సోనా' రూపాల్లో విడుదల చేసింది. ఒకవేళ మీరు ఈ సరికొత్త ఈవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఏ వేరియంట్లో ఏ ఫీచర్లు ఉన్నాయో, మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో ఈ కింది విశ్లేషణ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు.
1. టాటా సియెర్రా ఈవీ ప్యూర్ - బేస్ వేరియంట్..
టాటా సియెర్రా ఈవీ బేస్ వేరియంట్ అయిన 'ప్యూర్'లోనే కస్టమర్లకు ఊహించని రేంజ్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఫీచర్లు: అల్ట్రా గ్లైడ్ సస్పెన్షన్, బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, లైట్ సేబర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆర్18 అల్లాయ్ వీల్స్.
టెక్నాలజీ: 31.24 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 26.03 సెంటీమీటర్ల డిజిటల్ కాక్‌పిట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్‌ప్లే, 5జీ ఆధారిత iRA.ev కనెక్టెడ్ కార్ టెక్నాలజీ.
కంపార్ట్ అండ్ సేఫ్టీ: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (విత్ ఆటో హోల్డ్), పిఎం 2.5 ఫిల్టర్ గల ఎయిర్ ప్యూరిఫైయర్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్.
2. టాటా సియెర్రా ఈవీ ప్యూర్ ఎస్ - ప్యూర్ వేరియంట్‌పై అదనంగా..
బేస్ వేరియంట్ ఫీచర్లతో పాటు మరికొన్ని లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
అదనపు ఫీచర్లు: వాయిస్ కమాండ్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్.
ప్రత్యేకత: వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్), వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) చార్జింగ్ టెక్నాలజీ (దీని ద్వారా ఈ కారు బ్యాటరీ నుండి ఇతర ఎలక్ట్రిక్ వస్తువులకు లేదా మరో ఈవీ కారుకు చార్జింగ్ ఇచ్చుకోవచ్చు), ఫ్రంట్ ఫ్రంక్ స్టోరేజ్ (బోనెట్ కింద అదనపు లగేజ్ స్పేస్).
3. టాటా సియెర్రా ఈవీ అడ్వెంచర్ - ప్యూర్ ఎస్ వేరియంట్‌పై అదనంగా..
లాంగ్ డ్రైవ్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని ఈ వేరియంట్‌ను రూపుదిద్దారు.
ఆడియో అండ్ టెక్నాలజీ: 12 స్పీకర్లు, సబ్‌వూఫర్, సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్‌తో కూడిన జేబీఎల్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, 30కి పైగా యాప్స్ రన్ అయ్యే ఆర్కేడ్ ఈవీ (Arcade.ev) సూట్.
రక్షణ అండ్ డ్రైవింగ్: బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌తో కూడిన 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, యాంబియంట్ లైటింగ్.
పర్ఫార్మెన్స్: రోటరీ నాబ్‌తో ఆపరేట్ చేయగల 4 టెర్రైన్ మోడ్స్ (నార్మల్, వెట్/రైన్, రఫ్, కస్టమ్), అద్భుతమైన 'డ్రిఫ్ట్ మోడ్'.
4. టాటా సియెర్రా ఈవీ ఎంపవర్డ్ - అడ్వెంచర్ వేరియంట్‌పై అదనంగా..
నిజమైన లగ్జరీ, డిజిటల్ అనుభూతిని ఈ టాటా సియెర్రా ఈవీ వేరియంట్ అందిస్తుంది.
డిస్‌ప్లే: హారిజన్ వ్యూ ట్రిపుల్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్‌ల అనుభూతి).
లగ్జరీ ఫీచర్లు: వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, లెథరెట్ ఇంటీరియర్స్.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ: గెస్టర్ కంట్రోల్ (చేతి సైగలతో) ఓపెన్ అయ్యే క్లామ్‌షెల్ టెయిల్‌గేట్, ఎన్‌ఎఫ్‌సీ కార్డ్ ద్వారా కార్ లాకింగ్/అన్‌లాకింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్.
5. టాటా సియెర్రా ఈవీ ఎంపవర్డ్ ఏ - ఎంపవర్డ్ వేరియంట్‌పై అదనంగా..
టాటా సియెర్రా ఈవీలోని ఈ వేరియంట్ టెక్నాలజీ, సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. దీనిని హైటెక్ వేరియంట్ అని చెప్పొచ్చు.
ప్రధాన ఫీచర్లు: ఆర్19 పెద్ద అల్లాయ్ వీల్స్, మల్టీ కలర్ గైడ్స్‌తో కూడిన హైపర్ హెడ్-అప్ డిస్‌ప్లే.
సేఫ్టీ నెక్స్ట్ లెవెల్: ఏకంగా 22 కీలక ఫీచర్లు కలిగిన లెవెల్ 2+ అడాస్ టెక్నాలజీ, 16 ఫీచర్లతో కూడిన ఆటో పార్క్ అసిస్ట్ (కారు ఆటోమేటిక్‌గా పార్క్ అవుతుంది), 540-డిగ్రీ ట్రాన్స్‌పరెంట్ కెమెరా వ్యూ.
6. టాటా సియెర్రా ఈవీ ఎంపవర్డ్ ఏ ఏడబ్ల్యూడీ- టాప్ ఎండ్ మోడల్..
ఆఫ్‌రోడింగ్, అత్యంత పవర్‌ఫుల్ రైడింగ్ ఇష్టపడే వారి కోసం టాటా తీసుకొచ్చిన అల్టిమేట్ వేరియంట్ ఇది.
ఆఫ్‌రోడ్ కింగ్: ఇందులో క్వాడ్ వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది. నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది.
ప్రత్యేక ఫీచర్లు: తక్షణ వేగాన్ని అందుకోవడానికి ‘బూస్ట్ మోడ్’, ఆఫ్‌రోడ్ అసిస్ట్.
టెర్రైన్ మోడ్స్: ఎలాంటి కఠినమైన దారుల్లోనైనా దూసుకెళ్లడానికి 6 ప్రత్యేక టెర్రైన్ మోడ్స్ (నార్మల్, గ్రాస్/స్నో, మడ్/గ్రావెల్, శాండ్, రాక్ క్రాాల్, కస్టమ్) ఇందులో ఉన్నాయి.
మరి ఈ టాటా సియెర్రా ఈవీలో మీరు ఏ వేరియంట్‌ని ఎంచుకుంటారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


