Tata Sierra EV prices : టాటా సియెర్రా ఈవీ వేరియంట్లు, వాటి ధరలు..

Tata Sierra EV : భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ 'సియెర్రా'ను ఎలక్ట్రిక్ అవతార్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ టాటా సియెర్రా ఈవీ వేరియంట్లు, వాటి ధరలు, ఓవరాల్​ ఫీచర్స్​ వివరాలు మీకోసం..

Published on: Jul 1, 2026, 12:19:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లో తిరుగులేని అగ్రగామిగా దూసుకుపోతున్న టాటా మోటార్స్, సరికొత్త సంచలనానికి తెరలేపింది. 90ల కాలంలో భారతీయ ఆటోమొబైల్ ప్రియులను ఎంతగానో అలరించిన ఐకానిక్ బ్రాండ్ 'సియెర్రా'ను సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎంతో కాలంగా వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాటా సియెర్రా ఈవీ’ ఎస్‌యూవీని కంపెనీ అధికారికంగా భారత్‌లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 18.79 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు.

టాటా సియెర్రా ఈవీ ప్రదర్శన..
టాటా సియెర్రా ఈవీ ప్రదర్శన..

ఈ సరికొత్త ఈవీకి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, జులై 15 నుంచి డెలివరీలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా ఈవీ వేరియంట్లు, వాటి ధరలు, రేంజ్, ఓవరాల్ ఫీచర్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా సియెర్రా ఈవీ బ్యాటరీ ఆప్షన్లు.. రేంజ్ అదరహో!

టాటా సియెర్రా ఈవీ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను టాటా మోటార్స్ అందిస్తోంది.63kWh బ్యాటరీ ప్యాక్: ఇది బేస్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 238 పీఎస్ పవర్‌ను, 315 ఎన్​ఎం టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే ఏకంగా 565 కిలోమీటర్ల (ఎంఐడీసీ క్లెయిమ్డ్) దూరం ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

75kWh బ్యాటరీ ప్యాక్: లాంగ్ రేంజ్ కోరుకునే వారి కోసం ఈ పెద్ద బ్యాటరీని తీసుకొచ్చారు. ఇది రియర్-వీల్ డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ) ఆప్షన్‌తో గరిష్టంగా 665 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను ఇస్తుంది.

ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్: మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఆశించే వారి కోసం టాటా ఇందులో డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ సిస్టమ్‌ను కూడా జోడించింది. ఇది 349 పీఎస్ పవర్‌ను, 504 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తూ, సింగిల్ చార్జ్‌పై 624 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

డీసీ ఫాస్ట్ చార్జర్ ఉపయోగించి ఈ కారు బ్యాటరీని కేవలం 26 నిమిషాల్లోనే 20 శాతం నుంచి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో కలిసివచ్చే అంశం.

టాటా సియెర్రా ఈవీ వేరియంట్లు- వాటి ధరలు..

టాటా సియెర్రా ఈవీ ప్యూర్- రూ. 18.79 లక్షలు (63 KWH)

ప్యూర్ ఎస్​- రూ. 19.99 లక్షలు (63 KWH)

అడ్వెంచర్- రూ. 20.99 లక్షలు (63 KWH), రూ. 22.19 లక్షలు (75 KWH- ఆర్​డబ్ల్యూడీ)

ఎపవర్డ్- రూ. 22.79 లక్షలు (63 KWH), రూ. 23.79 లక్షలు (75 KWH- ఆర్​డబ్ల్యూడీ),

ఎంపవర్డ్​ ఏ- రూ. 24.79 లక్షలు (75 KWH- ఆర్​డబ్ల్యూడీ), రూ. 25.99 లక్షలు (75 KWH- క్యూడబ్ల్యూడీ).

  • ఇవి ఎక్స్​షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.
టాటా సియెర్రా ఈవీ హైలైట్స్..
టాటా సియెర్రా ఈవీ హైలైట్స్..

టాటా సియెర్రా ఈవీ- వింటేజ్ లుక్.. మోడ్రన్ టచ్..

పాత సియెర్రా కారు క్లాసిక్ డిజైన్‌ను గుర్తుకు తెస్తూనే, నేటి తరం మెచ్చేలా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డిజైన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు ముందుభాగంలో బాడీ కలర్ క్లోజ్డ్ గ్రిల్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు అమర్చారు. పాత మోడల్ తరహాలోనే వెనుక వైపు ఉండే సిగ్నేచర్ వ్రాప్-అరౌండ్ గ్లాస్ లుక్‌ను అలాగే కొనసాగించారు. అయితే దీనికి అదనంగా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, 19-ఇంచ్ ఏరో-స్టైల్ అలాయ్ వీల్స్‌తో ప్రీమియం లుక్ తీసుకొచ్చారు.

టాటా సియెర్రా ఈవీ లగ్జరీ క్యాబిన్.. టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్!

టాటా సియెర్రా ఈవీ లోపలి భాగం (ఇంటీరియర్) అత్యంత విలాసవంతంగా ఉంది. డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో పాటు డ్యాష్‌బోర్డ్‌పై ఏకంగా మూడు 12.3-ఇంచుల స్క్రీన్లను ఏర్పాటు చేయడం ఈ కారు ప్రధాన ఆకర్షణ. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు కో-ప్యాసింజర్ కోసం ప్రత్యేక డిస్‌ప్లేను ఇచ్చారు.

ఇంకా ఈ కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి:-

  • పనోరమిక్ సన్‌రూఫ్
  • వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే
  • 12 స్పీకర్లతో కూడిన జేబీఎల్ బ్లాక్ సౌండ్ సిస్టమ్
  • హెడ్-అప్ డిస్‌ప్లే
  • వైర్‌లెస్ ఫోన్ చార్జర్
  • యాంబియంట్ లైటింగ్
  • పవర్డ్ టెయిల్‌గేట్

టాటా సియెర్రా ఈవీ- భద్రతకు పెద్ద పీట..

ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు టాటా మోటార్స్ భద్రతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారులో లెవెల్-2 అడాస్ సాంకేతికతను అందించారు. దీనితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను ప్రాండ్‌గా ఇస్తున్నారు.

టాటా సియెర్రా ఈవీ- మార్కెట్లో గట్టి పోటీ..

టాటా లైనప్‌లో చూసుకుంటే ఈ సియెర్రా ఈవీ.. కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ సరికొత్త ఎస్‌యూవీ.. మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతీ సుజుకీ ఈ-విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More