Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్-5 విషయాలు..
Tata Sierra EV price : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఐకానిక్ బ్రాండ్ ‘టాటా సియెర్రా’ సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి టాప్-5 విషయాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారతీయ వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా సియెర్రా ఈవీ’ అధికారికంగా లాంచ్ అయింది. పాత సియెర్రా క్లాసిక్ డిజైన్ లుక్‌ను కాపాడుకుంటూనే.. ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, లాంగ్ రేంజ్, లగ్జరీ ఫీచర్లతో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రీమియం రేంజ్‌లో టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చింది. ఈ సరికొత్త ఈవీ కార్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, జులై 15, 2026 నుంచి కస్టమర్లకు డెలివరీలు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విశేషాలు ఇక్కడ చూద్దాము..
1. టాటా సియెర్రా ఈవీ- ధర, లాంచ్ టైమింగ్..
టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 18.79 లక్షలుగా (చార్జర్ లేకుండా) నిర్ణయించారు. కస్టమర్ల జీవనశైలికి అద్దం పట్టేలా, నిత్య జీవితంలో సులభంగా వాడుకునేందుకు వీలుగా దీనిని డిజైన్ చేసినట్టు సంస్థ చెప్పింది. ఇక ఇందులో అన్ని హంగులూ ఉన్న టాప్-ఎండ్ మోడల్ ‘సియెర్రా ఈవీ ఎంపవర్డ్ ఏ 75 kWh క్యూడబ్ల్యూడీ’ ధర రూ. 25.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, చార్జర్ లేకుండా) ఉంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో లగ్జరీ కారును కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది!
2. టాటా సియెర్రా ఈవీ- మైండ్ బ్లోయింగ్ రేంజ్!
ఈ కారులో అమర్చిన 75 kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 665 కిలోమీటర్ల (ఎంఐడీసీ సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. అయితే సాధారణ రోడ్డు పరిస్థితుల్లో ఇది సులభంగా 510 నుంచి 530 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఇందులో అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 15 నిమిషాల పాటు ఫాస్ట్ ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా 263 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే కేవలం 26 నిమిషాల్లోనే కారు బ్యాటరీ 20 శాతం నుంచి 80 శాతానికి రీఛార్జ్ అవుతుంది. వీటన్నింటికీ మించి కస్టమర్లకు భారీ భరోసా ఇస్తూ.. హై-వోల్టేజ్ (హెచ్వీ) బ్యాటరీపై టాటా మోటార్స్ ‘లైఫ్‌టైమ్ వారంటీ’ని ఆఫర్ చేస్తుండటం విశేషం.
3. టాటా సియెర్రా ఈవీ- క్యాబిన్ కాదు.. ‘లగ్జరీ లైఫ్‌స్పేస్’
ఈ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లోపలి భాగాన్ని టాటా ఒక విలాసవంతమైన గదిలా తీర్చిదిద్దింది. దీనికి ‘లగ్జరీ లైఫ్‌స్పేస్’ అని పేరు పెట్టింది.
టెక్నాలజీ హంగులు: ఇందులో ‘థియేటర్ ప్రో’ పేరుతో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌ను ఇచ్చారు. 12 స్పీకర్ల జేబీఎల్ బ్లాక్ సౌండ్ సిస్టమ్, సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్, డాల్బీ అట్మోస్ ఆడియో ద్వారా కారులోనే థియేటర్ ఫీలింగ్ లభిస్తుంది.
ఫీచర్లు: ఆకాశాన్ని స్పష్టంగా చూసేందుకు వీలుగా ‘పనోరామాక్స్’ సన్‌రూఫ్, డ్రైవర్ కోసం ‘హైపర్ హెడ్స్-అప్ డిస్ప్లే’, కారులోనే గేమ్స్ ఆడుకునేలా ‘ఎయిర్‌కన్సోల్ గేమింగ్’ ఫీచర్లను జోడించారు.
లగేజ్ అండ్ కంఫర్ట్: సీట్లకు అదనపు థై-సపోర్ట్ ఎక్స్‌టెండర్ ఉంది. వెనుక వైపు చేతులతో పనిలేకుండా కాలితో సైగ చేస్తే తెరుచుకునే ‘పవర్డ్ జెస్టర్ టెయిల్‌గేట్’, 622 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఇచ్చారు.
ఈ-వాలెట్ టెక్నాలజీ: డిజి యాక్సెస్, ఈ-వాలెట్ ఫంక్షన్ల ద్వారా ఆటో పార్కింగ్, కారును రిమోట్‌తో ముందుకు వెనుకకు జరిపే ‘సమన్ మోడ్’, రివర్స్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
4. టాటా సియెర్రా ఈవీ- అదిరిపోయే పర్ఫార్మెన్స్!
టాటా మోటార్స్ అధునాతన ‘Acti.ev+’ ఆర్కిటెక్చర్‌పై ఈ కారును రూపొందించారు. క్వాడ్-వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) టెక్నాలజీతో కూడిన డ్యూయల్-మోటర్ సెటప్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ.. ఏకంగా 306 పీఎస్ పవర్, 504 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలోని ‘బూస్ట్ మోడ్’ ఆన్ చేస్తే చాలు.. కేవలం 5.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కఠినమైన రోడ్లపై ప్రయాణించడానికి 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 6 టెర్రైన్ మోడ్స్ ఇచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ కారు చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూపే ‘ట్రాన్స్‌పరెంట్ మోడ్’ కలిగిన 540-డిగ్రీల హెచ్‌డీ కెమెరా సిస్టమ్ ఇందులో ఉండటం విశేషం.
5. టాటా సియెర్రా ఈవీ- కలర్స్ అండ్ మార్కెట్ పొజిషన్..
ఈ ప్రీమియం ఎస్‌యూవీ ప్రిస్టిన్ వైట్, ప్యూర్ గ్రే, కూర్గ్ క్లౌడ్స్, బెంగాల్ రూజ్, అండమాన్ అడ్వెంచర్, రిషికేష్ రాపిడ్స్, నైనిటాల్ నాక్టర్న్ అనే 7 ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.
"భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అత్యంత కీలకమైనది. నేటి తరం కస్టమర్లు తమ కారును కేవలం ప్రయాణ సాధనంగా కాకుండా.. తమ జీవనశైలికి, ఆశయాలకు ప్రతీకగా చూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కస్టమర్లను మరింతగా ఆకర్షించడానికి, వారి అంచనాలను అందుకోవడానికి ‘సియెర్రా ఈవీ’ లీడ్ తీసుకోబోతోంది," అని లాంచ్ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
మరి మీరు ఈ టాటా సియెర్రా ఈవీ కొనుగోలు చేస్తున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


