Family SUVs : బూట్​ స్పేస్​ ఎక్కువగా ఉన్న టాప్​-5 ఎస్​యూవీలు ఇవి.. ఫ్యామిలీ ట్రిప్స్​కి బెస్ట్​!

మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా భారతదేశంలో SUVల హవా కొనసాగుతోంది. పెద్ద కారు కొనాలనే ఆశయం పెరిగినప్పటికీ, చాలా SUVల్లో లగేజీ ఉంచే స్థలం (Boot Space) తక్కువగా ఉంటుంది. అయితే, 2026లో మార్కెట్లో లభిస్తున్న హోండా ఎలివేట్, టాటా సియెర్రా వంటి 5 కార్లు మాత్రం భారీ బూట్ స్పేస్‌ను అందిస్తున్నాయి.

Published on: Feb 4, 2026, 10:01:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి! ఇప్పుడు అందరి చూపు ఎస్​యూవీల వైపు మళ్లుతోంది. పెద్ద కారు ఉండాలనే కోరిక పెరగడం వల్ల ఈ సెగ్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అయితే, సాధారణంగా ఎస్​యూవీలు పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పటికీ, లగేజీ పెట్టుకునే స్థలం (బూట్ స్పేస్) విషయంలో తరచూ రాజీ పడాల్సి వస్తుంటుంది. కానీ, మీరు ఎక్కువ లగేజీతో, ఫ్యామిలీ ట్రిప్స్​ కోసం తరచూ ప్రయాణించే వారైతే.. 2026లో అత్యధిక బూట్ స్పేస్‌ను ఆఫర్ చేస్తున్న ఈ 5 కాంపాక్ట్ ఎస్​యూవీలను ఖచ్చితంగా పరిశీలించాలి.

బూట్​ స్పేస్​ ఎక్కువగా ఉన్న టాప్​-5 ఎస్​యూవీలు ఇవి..
బూట్​ స్పేస్​ ఎక్కువగా ఉన్న టాప్​-5 ఎస్​యూవీలు ఇవి..

1. హోండా ఎలివేట్..

కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్‌లో లగేజీ స్పేస్ విషయంలో 'హోండా ఎలివేట్' రారాజు అని చెప్పవచ్చు. ఇది ఏకంగా 458 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందిస్తోంది.

ఇంజన్ అండ్​ పవర్: ఇందులో 1.5 లీటర్ ఐ-వీటెక్​ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 119.35 బీహెచ్​పీ పవర్, 145 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ సీవీటీ ఆప్షన్లలో లభిస్తుంది.

ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.59 లక్షలు.

2. టాటా సియెర్రా..

ఈ సెగ్మెంట్‌లో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన 'టాటా సియెర్రా' బూట్ స్పేస్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్శిల్ ట్రే ఉంటే 450 లీటర్లు, ఒకవేళ ట్రే తొలగిస్తే ఏకంగా 622 లీటర్ల స్థలం ఇందులో లభిస్తుంది.

ఇంజన్ ఆప్షన్లు: ఇందులో మూడు రకాల ఇంజన్లు ఉన్నాయి. 1.5లీటర్​ రెవోట్రాన్ పెట్రోల్ (103.56 బీహెచ్​పీ), 1.5L టర్బోచార్జ్డ్ హైపెరియన్ పెట్రోల్ (157.81 బీహెచ్​పీ), 1.5లీటర్​ టర్బో డీజిల్ క్రయోజెట్ (116.39 బీహెచ్​పీ).

ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి.

ధర: ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలు.

3. ఎంజీ ఆస్టర్..

స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చే ఎంజీ ఆస్టర్ ఎస్​యూవీ.. 448 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

ఇంజన్ అండ్​ పవర్: 1.5 లీటర్ వీటీఐ-టెక్​ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ కారు 108.5 బీహెచ్​పీ పవర్, 144 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది.

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్, 8-స్పీడ్ సీవీటీ గేర్ బాక్స్ ఆప్షన్స్​ ఉన్నాయి.

ధర: ఈ జాబితాలో అత్యంత తక్కువగా రూ. 9.65 లక్షల ప్రారంభ ధరతో ఇది లభిస్తుంది.

4. కియా సెల్టోస్..

ఫీచర్ల పరంగా దూసుకుపోయే కియా సెల్టోస్ 447 లీటర్ల బూట్ స్పేస్‌తో లగేజీకి తగినంత స్థలాన్ని కల్పిస్తోంది.

ఇంజన్ ఆప్షన్లు: ఇందులో 1.5ఎల్​ పెట్రోల్, 1.5ఎల్​ టర్బో పెట్రోల్, 1.5ఎల్​ టర్బో డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 157.57 బీహెచ్​పీ పవర్‌ను ఇస్తుంది.

ట్రాన్స్‌మిషన్: మాన్యువల్, ఐవీటీ, ఐఎంటీ, డీసీటీ, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్.. ఇలా అన్ని రకాల గేర్ బాక్స్ ఆప్షన్లు ఈ కియా సెల్టోస్​ ఎస్​యూవీలో ఉన్నాయి.

ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలు.

5. హ్యుందాయ్ క్రెటా..

భారత మార్కెట్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్​యూవీల్లో ఒకటిగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా 433 లీటర్ల బూట్ స్పేస్‌ను ఆఫర్ చేస్తోంది.

ఇంజన్ అండ్​ పవర్: కియా సెల్టోస్ మాదిరిగానే ఇందులో కూడా మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు (1.5ఎల్​ పెట్రోల్, టర్బో పెట్రోల్, టర్బో డీజిల్) లభిస్తాయి.

ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి.

ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.79 లక్షలు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More