ఇండియాలోకి హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీ- సూపర్​ డిజైన్​, అదిరే ఫీచర్లు..

హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎస్‌యూవీ రాబోతోంది. ముంబై వీధుల్లో టెస్టింగ్ నిర్వహిస్తుండగా ఈ కారు మొదటిసారి కెమెరాకు చిక్కింది. అయోనిక్ 5 తరహా డిజైన్, మస్క్యులర్​ లుక్‌తో ఉన్న ఈ మిస్టరీ ఎస్‌యూవీ ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Published on: Jan 24, 2026 2:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీలకు ఉన్న డిమాండ్​, పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు దాదాపు ప్రతి ఆటోమొబైల్​ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​.. ఇండియాలో ఒక కొత్త ఎస్​యూవీని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎస్​యూవీ ముంబైలో టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ ఇటీవలే కనిపించింది. ఈ స్పై షాట్స్​ ఇమేజ్​లు ఇప్పటికే ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీ
హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీ

హ్యుందాయ్ కొత్త ఎస్​యూవీ..

ఈ కొత్త ఎస్​యూవీ గురించి హ్యుందాయ్​ సంస్థ అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. ఫలితంగా ఇది ఏ మోడల్ అయి ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాహ్య రూపం (ఎక్స్‌టీరియర్): ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా శక్తివంతంగా, బాక్సీ ఆకారంలో ఉంది. దీనిలో గమనించాల్సిన ప్రధానాంశాలు ఇవే:

అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును గుర్తుకు తెచ్చేలా డాటెడ్ ప్యాటర్న్‌తో కూడిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఉన్నాయి.

16-ఇంచ్​ డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎంఆర్‌ఎఫ్ టైర్లతో కారుకు 'మస్క్యులర్​' లుక్ ఇచ్చారు.

ఫ్లాట్ టెయిల్‌గేట్, భారీగా ఉన్న రియర్ బంపర్, స్పోర్టీ లుక్ ఇచ్చే రియర్ స్పాయిలర్ దీనికి అదనపు ఆకర్షణ.

డోర్ హ్యాండిల్స్ లోపలికి ఒదిగిపోయి ఉండే (ఫ్లష్​ ఫిట్టింగ్​) సరికొత్త డిజైన్‌తో ఉన్నాయి.

షార్క్-ఫిన్ యాంటెన్నా, బ్లాక్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు కారు ప్రీమియం లుక్‌ను పెంచుతున్నాయి.

హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీ- అత్యాధునిక ఫీచర్లు..

ఎస్​యూవీ లోపలి భాగాలకు సంబంధించి ప్రస్తుతం సమాచారం అందుబాటులో లేదు. కానీ బయట నుంచి తీసిన స్పై షాట్స్​ని గమనిస్తే, ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉంది.

సుమారు 10-ఇంచ్​ పరిమాణంలో ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కనిపిస్తున్నాయి.

ఓఆర్​వీఎంల కింద ఉన్న కెమెరాలను బట్టి, ఇందులో 360-డిగ్రీ కెమెరా ఫీచర్ కచ్చితంగా ఉంటుందని అర్థమవుతోంది.

  • రెండు రోజుల్లో కొత్త Renault Duster లాంచ్​- ధర, ఫీచర్లు, ఇంజిన్​ ఆప్షన్ల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇది ఏ మోడల్ అయి ఉంటుంది?

ప్రస్తుతానికి ఈ ఎస్​యూవీ పేరుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఆటోమొబైల్​ నిపుణులు రెండు రకాల అంచనాలు వేస్తున్నారు. అవి..

గత ఏడాది అక్టోబర్‌లో హ్యుందాయ్ తన ఇన్వెస్టర్ల సమావేశంలో ఒక 'మస్కులర్ ఎస్‌యూవీ'ని టీజ్ చేసింది. అది ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కలిగి ఉంటుందని అప్పట్లో చెప్పింది. బహుశా టెస్టింగ్ చేస్తున్న కారు అదే అయి ఉండవచ్చు.

మరో వాదన ప్రకారం.. కియా కంపెనీ తీసుకురాబోతున్న అత్యంత చిన్న ఎలక్ట్రిక్ కారు 'ఈవీ2' కు హ్యుందాయ్ వెర్షన్ ఇదై ఉండవచ్చు.

మొత్తానికి హ్యుందాయ్ ఈ కొత్త మోడల్‌తో ఎస్‌యూవీ విభాగంలో తన పట్టును మరింత బిగించేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

ఇండియాలో హ్యుందాయ్​కి క్రెటా, వెన్యూ వంటి బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ మోడల్స్​ ఉన్నాయి.