రెండు రోజుల్లో కొత్త Renault Duster లాంచ్​- ధర, ఫీచర్లు, ఇంజిన్​ ఆప్షన్లు ఇవి..

భారత ఆటోమొబైల్ మార్కెట్​లో సంచలనం సృష్టించిన రెనాల్ట్​ డస్టర్ తిరిగొస్తోంది. జనవరి 26న సరికొత్త అవతారంలో లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీ.. అద్భుతమైన ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో కస్టమర్లను పలకరించనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 24, 2026, 10:02:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

‘రెనాల్ట్​ డస్టర్​’.. భారతీయులకు ఈ పేరు ఒక ఎమోషన్​. దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి ఎస్​యూవీల్లో ఇదీ ఒకటి. మధ్యతరగతి ప్రజల బడ్జెట్​ ఎస్​యూవీగా గుర్తింపు తెచ్చుకుని, ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​ని ఒక ఊపు ఊపింది ఈ మోడల్​. కానీ దీనిని 2022లో సంస్థ డిస్కంటిన్యూ చేసింది. అయితే ఈ రెనాల్ట్​ డస్టర్​ని సంస్థ ఇండియాలోకి తిరిగి తీసుకోస్తోంది. ఇంకో రెండు రోజుల్లో, అంటే 2026 జనవరి 26న, రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సరికొత్త జనరేషన్ డస్టర్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్​లోకి విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 రెనాల్ట్​ డస్టర్​..
2026 రెనాల్ట్​ డస్టర్​..

2026 రెనాల్ట్​ డస్టర్​- డిజైన్‌లో భారీ మార్పులు..

భారత మార్కెట్ కోసం వస్తున్న ఈ కొత్త రెనాల్ట్​ డస్టర్ చూడటానికి అంతర్జాతీయ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేశారు. ముఖ్యంగా వెనుక వైపు 'కనెక్టెడ్ టెయిల్ లాంప్' సెటప్‌ను జోడించారు. ఇది గ్లోబల్ మోడల్‌లో కూడా లేదు. దృఢమైన బాడీ, ఎల్‌ఈడీ లైటింగ్, స్కిడ్ ప్లేట్లు, ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్‌తో ఈ ఎస్‌యూవీ పవర్‌ఫుల్ లుక్‌ను సంతరించుకుంది. గ్రిల్‌పై బోల్డ్‌గా ఉండే "RENAULT" అక్షరాలు దీనికి మరింత హుందాతనాన్ని ఇస్తాయి.

2026 రెనాల్ట్ డస్టర్​- ఫీచర్లు అదరహో..

కారు లోపలి భాగం (క్యాబిన్) ఆధునిక హంగులతో నిండిపోయింది. ఇందులో:

10.1 ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

7 ఇంచ్​ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే సదుపాయం.

భద్రత కోసం అడాస్​, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ 2026 రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీలో ఉండే అవకాశం ఉంది.

2026 రెనాల్ట్​ డస్టర్​- ఇంజిన్ సామర్థ్యం..

రెనాల్ట్​ ఈసారి ఇంజిన్ విషయంలో రాజీ పడటం లేదు. డస్టర్​ ఎస్​యూవీలో ప్రధానంగా రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండనున్నాయి:

1.3 లీటర్ టర్బో పెట్రోల్: ఇది 156బీహెచ్​పీ పవర్‌ను, 250ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను జత చేశారు.

1.0 లీటర్ కొత్త టర్బో పెట్రోల్: ఇది పూర్తిగా సరికొత్త ఇంజిన్. హ్యుందాయ్, వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీల 1.0ఎల్​ ఇంజిన్లకు గట్టి పోటీ ఇచ్చేలా దీని పవర్ ఉండనుంది.

హైబ్రిడ్ వెర్షన్ కూడా: పర్యావరణ ప్రేమికుల కోసం 2026 మధ్య నాటికి హైబ్రిడ్ మోడల్‌ను కూడా తీసుకురానున్నట్లు రెనాల్ట్​ ధృవీకరించింది. అంతర్జాతీయ మార్కెట్​లో ఉన్న 1.6 లీటర్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కాంబినేషన్ భారత్‌లోనూ వచ్చే అవకాశం ఉంది. ఇది నగరాల్లో ప్రయాణించేటప్పుడు 80 శాతం వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుందని కంపెనీ పేర్కొంది.

2026 రెనాల్ట్ డస్టర్​- ధర, పోటీ..

కొత్త రెనాల్ట్​ డస్టర్ ధర సుమారు రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. టాప్​ ఎండ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 18 లక్షల వరకు ఉండొచ్చు.

ఇది మార్కెట్​లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారా, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి దిగ్గజ మోడళ్లతో పోటీ పడనుంది.

లాంచ్​ రోజున ఈ 2026 రెనాల్ట్ డస్టర్​ ఎస్​యూవీ ధర, ఫీచర్లు సహా ఇతర వివరాలపై ఒక క్లారిటీ వస్తుంది.

మొత్తానికి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరికొత్త టెక్నాలజీతో వస్తున్న డస్టర్, భారత మార్కెట్​లో మళ్లీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More