...
...
Next Story

రాఖీ వేళ ప్రయాణికులకు శుభవార్త ... చర్లప్లలి - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ వివరాలు

Charlapalli Kakinada Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆగస్టు 27, 28 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Published on: Aug 25, 2026, 05:12:59 IST
Advertisement

SCR Charlapalli Kakinada Special Trains : హైదరాబాద్‌ నుంచి కోస్తాంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రాఖీ పండగతో పాటు సెలవులు ఉండటంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

ట్రైన్ టైమింగ్స్ వివరాలు…

  • రైలు నంబరు 07039 (చర్లపల్లి – కాకినాడ టౌన్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 27 గురువారం రోజున రాత్రి 19:50 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు (ఆగస్టు 28 శుక్రవారం) ఉదయం 09:30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
  • రైలు నంబరు 07040 (కాకినాడ టౌన్ – చర్లపల్లి) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 ఆగస్టు 28 శుక్రవారం రోజున సాయంత్రం 18:50 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 29 శనివారం) ఉదయం 07:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తూ ఈ ప్రత్యేక రైళ్లకు హాల్ట్‌లను కేటాయించారు. ఈ రైళ్లు రెండు మార్గాల్లోనూ పలు స్టేషన్లలో ఆగుతాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.... నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ,గుడివాడ,భీమవరం,తణకు, రాజమండ్రి,సామర్లకోటలో హాల్ట్ ఉంటుంది.

ప్రయాణికుల అన్ని వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో బోగీలను అమర్చారు. వీటిలో ఫస్ట్ ఏసీ (1AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe