తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇందిరమ్మ గృహ నిర్మాణ ఉత్సవం ప్రారంభమవుతుందని, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కోలం-కొఠారి గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో దశను ప్రారంభిస్తారన్నారు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సభాస్థలి కోసం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో గిరిజన కుటుంబాల ఇందిరమ్మ ఇండ్లలను పరిశీలించారు.
పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన వస్తుందని పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణం ఆర్భాటాలకు మాత్రమే పరిమితమైందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ. 22,500 కోట్లతో శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇంటి నిర్మాణ పురోగతికి అనుగుణంగా దశలవారీగా రూ. 5 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా పొంగులేటి గుర్తుచేశారు. ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష 20 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, జూన్ నాటికి 2 లక్షల 35 వేల ఇండ్లు పూర్తవుతాయని వెల్లడించారు.
మొదటి, రెండో విడతలకే పరిమితం కాకుండా అర్హత గల ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అనేది నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మహాలక్ష్మి, గృహజ్యోతి, రేషన్ కార్డులు, ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలలో ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. కోలం-కోఠారి గ్రామంలో నిర్మించిన గృహాలు ఆదివాసీ కుటుంబాల గృహ అవసరాలను తీర్చాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులైన మహిళలతో ముచ్చటించారు. అలాగే సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో 2026-28 సంవత్సరాలకు గాను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేశారు.
{{/usCountry}}మహాలక్ష్మి, గృహజ్యోతి, రేషన్ కార్డులు, ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలలో ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. కోలం-కోఠారి గ్రామంలో నిర్మించిన గృహాలు ఆదివాసీ కుటుంబాల గృహ అవసరాలను తీర్చాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులైన మహిళలతో ముచ్చటించారు. అలాగే సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో 2026-28 సంవత్సరాలకు గాను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేశారు.
{{/usCountry}}