రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ.. మెట్రోతో అనుసంధానం : కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తున్నట్టుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్దిదిద్దాలనేది తన కల అని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మెట్రో మార్గంతో అనుసంధానం చేయనున్నట్టుగా వెల్లడించారు.

'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నాం. సౌత్ ఇండియాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అమృత్ భారత్ పథకం కింద రూ.714 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నాం. ఇప్పటివరకు 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.' అని కిషన్ రెడ్డి తెలిపారు.
ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రోజువారీగా 1,97,000 మంది ప్రయాణికులు వస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2.70 లక్షల మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేస్తున్నట్టుగా తెలిపారు. గంటకు సుమారు 23 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా.. పనుల వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కొత్త నిర్మాణాల్లో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెన్ కార్ పార్కింగ్, ట్రావెలర్‌తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు.
సౌత్ సైడ్ బ్లాక్ నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. 'మొత్తం పునర్నిర్మాణ పనులను 13 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ స్టేషన్ మూడు ఎకరాల విస్తీర్ణంలో మూడు వేల మంది కూర్చునే విధంగా నిర్మిస్తున్నాం. స్టేషన్లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయి. రెండు సబ్ స్టేషన్లు, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్, ఐదు లక్షల లీటర్ల సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వంటి సదుపాయాలు ఉంటాయి.' అని కిషన్ రెడ్డి తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


