అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ ఎఫెక్ట్ ...! హైదరాబాద్‌లోని US కాన్సులేట్‌ వద్ద భద్రత కట్టుదిట్టం

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోహైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.

Published on: Mar 2, 2026, 07:07:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు…. నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ (ఫైల్ ఫొటో)
నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ (ఫైల్ ఫొటో)

భద్రత కట్టుదిట్టం….!

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్సులేట్ వద్ద ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి….. బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ముందు జాగ్రత్త చర్యగా నానక్ రామ్ గూడలోని అమెరికా కాన్సులేట్ వెలుపల అదనపు సిబ్బందిని మోహరించడంతో భద్రత పెంచామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అదనపు బలగాలను మోహరించడం ద్వారా భద్రతను పెంచామని వివరించారు.

అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిని ఖండిస్తూ ఆదివారం హైదరాబాద్ లో పలువురు నిరసన ప్రదర్శించారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాతబస్తీ పురానీ హవేలీ చౌరస్తా వద్ద షియా ముస్లింలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమేనీ చిత్రపటాన్ని చేతుల్లో పట్టుకొని నివాళులు అర్పించారు. పురానీ హవేలీ చౌరస్తా నుంచి దారుషిఫా వరకు నిరసన ర్యాలీ సాగింది. ఇందులో భారీఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇలాంటి నిరసనల నేపథ్యంలో…. పోలీసులు ముందస్తుగానే అమెరికా కాన్సులేట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో శనివారం టెహ్రాన్ లో జరిగిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ఈ విషయాన్ని ధృవీకరించింది, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ద్వారా…. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని భారతీయ పౌరులకు వీసాతో పాటు కాన్సులేట్ సేవలు అందుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More