జీవితంలో సంగారెడ్డిలో పోటీ చేయను - జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటన చేశారు. తన కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ని పిలిచి అవమానించానేమో అని ఫీలయ్యారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేశారు. తన కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా…. సంగారెడ్డిలో ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇచ్చారని… అలాంటి కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ తనకోసం ఇక్కడికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీని పిలిచి అవమానించానేమో అని జగ్గారెడ్డి ఫీలయ్యారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ లో 2012-2013 లో ఇళ్ల పట్టా పొందిన వారితో పాటు ఇంటి స్థలం లేనివారితో సంగారెడ్డి గంజ్ మైదాన్ లో శనివారం జగ్గారెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… తన ఓటమిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా.. తాను ప్రచారానికి కూడా రానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో మాత్రం చేయనని తేల్చి చెప్పారు.
పేదల ఇళ్ల సమస్యలపై జగ్గారెడ్డి మాట్లాడుతూ…. కిరాయి ఇళ్లలో ఉండేవాళ్ల కష్టాలు నాకే ఎక్కువగా తెలుసన్నారు. “ 22 సంవత్సరాలు కిరాయి ఇంటిలోనే ఉన్నా.. అందుకే మీకు సొంత ఇంటి జాగ ఉండాలని ప్రయత్నం చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలోనే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి సంగారెడ్డిలోని 5500 పేద ప్రజలకు 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించాను. మళ్ళీ మీకు 80 గజాల స్థలం ఇవ్వడానికి సంగారెడ్డి, కంది మండలాల్లో 200 ఎకరాల స్థల సేకరణ చేయడానికి కలెక్టర్ తో కూడా మాట్లాడాను. ఈ జనవరి నెల నుండే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్న.. వచ్చే నవంబర్ వరకు ఒక కొలిక్కి తీసుకొస్తాను. భూసేకరణ కాగానే మళ్ళీ మీతో మీటింగ్ పెడతా” అని జగ్గారెడ్డి ప్రకటించారు.
“నన్ను ఒడగొట్టారని నేను ఏనాడు బాధపడలేదు. ఒక రకంగా మంచి పనే చేశారు. నేను ఓడిపోవడం వల్ల నా భార్య నిర్మల కార్పొరేషన్ చైర్మన్ అయ్యింది. నాలుగున్నరేళ్లు నేను పైసలు పంచుతా…. నా దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ ఎన్నికలప్పుడే పైసలు ఉండవు.. నాకు అదే శాపం. వాళ్ళ లాగా నేను కూడా ఓటుకు వెయ్యి ఇయ్యామంటే ఇస్తా.. కానీ నాది అలా ఆలోచించే స్వభావం కాదు. పదేళ్లు అధికారం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం… నా మాట చెల్లుతది. సీఎం రేవంత్ రెడ్డి నేను చెబితే వింటడు. జగ్గారెడ్డిగా నేను మాట ఇస్తున్నా... సంగారెడ్డి లో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి 80 గజాల స్థలం ఇప్పిస్తాను” అని జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

