...
...
Next Story

హైదరాబాద్‌ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ - ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్!

హైదరాబాద్ నగరంలో ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను జీడిమెట్ల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిని బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

Published on: Jun 13, 2026, 20:50:25 IST
Advertisement

Bangladeshi Nationals Arrested in Hyderabad : దేశంలోకి అక్రమంగా చొరబడి, ఎలాంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీసులు శనివారం (జూన్ 13) అదుపులోకి తీసుకున్నారు. నిఘా సమాచారం (ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్) ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు.

ఏడుగురు అరెస్ట్…

ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

నగరంలోని గజులరామారం-జీడిమెట్ల పరిధిలోని హెచ్ఏఎల్ (HAL) కాలనీలోని ఒక అద్దె ఇంట్లో కొందరు విదేశీయులు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై హఠాత్తుగా దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో… వీరి వద్ద ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్ వంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేవని తేలింది. వీరంతా సరిహద్దుల గుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, దేశంలోని వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడిన వారిలో ఒకరు నాలుగు ఐదేళ్ల క్రితమే దేశంలోకి చొరబడి… హైదరాబాద్ రాకముందు మహారాష్ట్రలో నివసించినట్లు ఒప్పుకోగా, మిగిలిన ఆరుగురు కేవలం రెండు నెలల క్రితమే ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ జాతీయుల వద్ద ఎలాంటి భారతీయ గుర్తింపు కార్డులు (ID Cards) లేవని ఒక ఉన్నత పోలీస్ అధికారి ప్రముఖ వార్తా సంస్థ 'పీటీఐ' (PTI) కి వివరించారు. వీరంతా ఇక్కడ బతుకుదెరువు కోసం బ్యూటీ పార్లర్లలో పనిచేస్తూ, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు.

డిపోర్టేషన్ సెంటర్‌కు తరలింపు…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks