...
...
Next Story

El Nino : వచ్చే ఫిబ్రవరి వరకు తీవ్రంగా ఎల్‌నినో ప్రభావం.. అవసరమైతే క్రాప్ హాలిడే

El Nino Effect In Telangana : తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. రాబోయే ఏడాది ఫిబ్రవరి నెల నాటికి ఇది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు.

Published on: Oct 15, 2026, 17:55:58 IST
Advertisement

తెలంగాణపై ఎల్‌నినో(El Nino) ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే ఏడాది ఫిబ్రవరి నెల నాటికి ఇది ఎక్కువగా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆందోళన వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాల వైఫల్యం, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరగడానికి ఎల్‌నినోనే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.

ఎల్‌నినో ఎఫెక్ట్
ఎల్‌నినో ఎఫెక్ట్

సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూర్, మంజీరా జలాశయాలను సందర్శించిన సీఎస్, క్షేత్రస్థాయిలో నీటి నిల్వలు, పంటల పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం సీఎస్ సంజయ్ జాజు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం చేతికి వచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రాబోయే 15 నుంచి 20 రోజులు అత్యంత కీలకమని తెలిపారు. వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, ఇతర సంబంధిత శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

వ్యవసాయ అవసరాలకు, పంపుసెట్లకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు సీఎస్. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎస్ వివరించారు. ఏ పరిస్థితుల్లోనూ తాగునీటి కొరత రాకుండా చూడడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా అత్యవసర ప్రణాళికను సిద్ధం చేశారు.

వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావాలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు సీఎస్ వెల్లడించారు. అధికారులు కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, స్థానిక ప్రజలతో మాట్లాడాలని సూచించారు. వారి అవసరాలను అర్థం చేసుకుని, ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం

ఎల్‌నినో ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో పరిస్థితులపై అఖిలపక్షం సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో అఖిలపక్ష సమావేశానికి ఏర్పాట్లు చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks