రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్యల కేసు దర్యాప్తులో మరో పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడటానికి ఒక రోజు ముందే ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు….. అందులోని డేటాను విశ్లేషించగా ఈ షాకింగ్ వీడియో బయటపడింది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఈ మొబైల్ వీడియోను పోలీసులు మీడియాకు చూపించారు. ఈ వీడియో ఆధారంగా నిందితుడు పక్కా ప్రణాళికతోనే, తీవ్రమైన కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్పష్టమవుతోంది.
పోలీసులు విడుదల చేసిన వీడియోలో రాజ్‌కుమార్ తన ఆవేదనను, హత్యకు గల కారణాలను వివరించాడు. ఒక అమ్మాయిని నమ్మి తాను ఎంతలా మోసపోయిందో ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు.
"నేను చాలా మోసపోయాను. నన్ను, నా కష్టాన్ని ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకొని వదిలేసింది. నన్ను నట్టేట ముంచి మోసం చేసింది. వారి కారణంగా నేను కోట్లాది రూపాయల అప్పుల పాలయ్యాను. సమాజంలో తలఎత్తుకోలేక, అప్పులు తీర్చలేక నా జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగింది" అని రాజ్‌కుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన రాజ్‌కుమార్…… తన పిల్లల భవిష్యత్తు నాశనమైందనే ఆక్రోశాన్ని ఆ వీడియోలో వెళ్లగక్కాడు. "చివరికి నా పిల్లలకు కూడా కనీసం ఒక సెంటు భూమి లేకుండా పోయింది. నా చేతులారా నేనే చేసుకున్నా. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాను. నన్ను ఈ స్థితికి తెచ్చిన వారిని వదిలిపెట్టను. అందర్నీ చంపేసి చనిపోవాలని నిర్ణయించుకున్నాను" అని ఈ సెల్ఫీ వీడియోలో మాట్లాడాడు.
రాజ్ కుమార్ సూసైడ్….!
ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ (32) కూడా మృతి చెందాడు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
{{/usCountry}}ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ (32) కూడా మృతి చెందాడు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
{{/usCountry}}స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అతని మృతదేహాం పక్కన పురుగుల మందు బాటిల్ లభ్యమైనట్లు తెలిసింది.
రాజ్‌కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అతని మృతదేహం తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. రాజ్‌కుమార్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. దీంతో చేవెళ్ల శ్మశాన వాటికలోనే రాజ్‌కుమార్ అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.