తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు బొగ్గు ఉత్పత్తి, రవాణాను వేగవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం నిర్ణయించింది. వర్షాలు తగ్గడంతో అన్ని బొగ్గు గని ప్రాంతాల్లో రోజువారీగా 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని అన్ని విభాగాలు, ఏరియా అధికారులను ఆదేశించింది.

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్ని ఏరియాల డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తిపై మాట్లాడారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే రోజువారీ కేటాయించిన లక్ష్యాలను మించి బొగ్గును ఉత్పత్తి చేసి, రైళ్ల ద్వారా రవాణా చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. థర్మల్ పవర్ ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా చూడటానికి ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విద్యుత్ శాఖలు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
'ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థగా దేశ ఇంధన భద్రతను కాపాడటంలో సింగరేణికి కీలక బాధ్యత ఉంది. కాబట్టి ప్రతీ ఏరియా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, అధిగమించాలి.' అని డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్నారు.
సమావేశంలో అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 31 నాటికి (తొలి ఐదు నెలల్లో) : సింగరేణి సంస్థ మొత్తం 2.53 కోట్ల టన్నుల బొగ్గును వివిధ ప్రాంతాలకు రవాణా చేసింది. ఈ రవాణా చేసిన బొగ్గులో 90 శాతానికి పైగా నేరుగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకే అందించడం విశేషం.
గనుల తవ్వకానికి ముందు తొలగించే ఓవర్ బర్డన్ ప్రక్రియలో ఆగస్టు చివరి నాటికి 1,315 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తొలగించారు. ఇది నిర్దేశించుకున్న లక్ష్యంలో 95 శాతానికి సమానం. ఈ ఓవర్ బర్డన్ తొలగింపు కాంట్రాక్ట్ ఏజెన్సీలు రాబోయే రోజుల్లో 100 శాతానికి పైగా ప్రగతి సాధించాలని, తద్వారా బొగ్గు తీత మరింత సులువవుతుందని సీఎండీ అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}గనుల తవ్వకానికి ముందు తొలగించే ఓవర్ బర్డన్ ప్రక్రియలో ఆగస్టు చివరి నాటికి 1,315 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తొలగించారు. ఇది నిర్దేశించుకున్న లక్ష్యంలో 95 శాతానికి సమానం. ఈ ఓవర్ బర్డన్ తొలగింపు కాంట్రాక్ట్ ఏజెన్సీలు రాబోయే రోజుల్లో 100 శాతానికి పైగా ప్రగతి సాధించాలని, తద్వారా బొగ్గు తీత మరింత సులువవుతుందని సీఎండీ అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}వేసవి, వర్షాకాలం అనంతరం పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు నిల్వలు పెరిగితే గ్రిడ్ స్థిరత్వంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. సరఫరా పెరగడం వల్ల సింగరేణి ఆదాయం పెరగడంతో పాటు కార్మికులకు, రాష్ట్ర ఖజానాకు చేకూరే లబ్ధి పెరుగుతుంది.
వర్షాలు తగ్గడం సింగరేణి గనుల తవ్వకానికి అనుకూలించే సమయం కావడంతో, అధికారులు సమన్వయంతో పనిచేసి రోజువారీ 1.9 లక్షల టన్నుల మార్కును చేరుకోవాలని యజమాన్యం స్పష్టం చేసింది.