విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సింగరేణి కీలక నిర్ణయం.. రోజుకు 1.9 లక్షల టన్నుల బొగ్గు టార్గెట్!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం తమ అన్ని ప్రాంతాలకు రోజువారీ బొగ్గు ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది. 1.9 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయాలని ఆదేశించింది.

Published on: Sep 5, 2026, 09:54:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు బొగ్గు ఉత్పత్తి, రవాణాను వేగవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం నిర్ణయించింది. వర్షాలు తగ్గడంతో అన్ని బొగ్గు గని ప్రాంతాల్లో రోజువారీగా 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని అన్ని విభాగాలు, ఏరియా అధికారులను ఆదేశించింది.

సింగరేణి బొగ్గు
సింగరేణి బొగ్గు

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్ని ఏరియాల డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తిపై మాట్లాడారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే రోజువారీ కేటాయించిన లక్ష్యాలను మించి బొగ్గును ఉత్పత్తి చేసి, రైళ్ల ద్వారా రవాణా చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. థర్మల్ పవర్ ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా చూడటానికి ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విద్యుత్ శాఖలు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

'ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థగా దేశ ఇంధన భద్రతను కాపాడటంలో సింగరేణికి కీలక బాధ్యత ఉంది. కాబట్టి ప్రతీ ఏరియా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, అధిగమించాలి.' అని డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్నారు.

సమావేశంలో అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 31 నాటికి (తొలి ఐదు నెలల్లో) : సింగరేణి సంస్థ మొత్తం 2.53 కోట్ల టన్నుల బొగ్గును వివిధ ప్రాంతాలకు రవాణా చేసింది. ఈ రవాణా చేసిన బొగ్గులో 90 శాతానికి పైగా నేరుగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకే అందించడం విశేషం.

గనుల తవ్వకానికి ముందు తొలగించే ఓవర్ బర్డన్ ప్రక్రియలో ఆగస్టు చివరి నాటికి 1,315 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తొలగించారు. ఇది నిర్దేశించుకున్న లక్ష్యంలో 95 శాతానికి సమానం. ఈ ఓవర్ బర్డన్ తొలగింపు కాంట్రాక్ట్ ఏజెన్సీలు రాబోయే రోజుల్లో 100 శాతానికి పైగా ప్రగతి సాధించాలని, తద్వారా బొగ్గు తీత మరింత సులువవుతుందని సీఎండీ అధికారులను ఆదేశించారు.

వేసవి, వర్షాకాలం అనంతరం పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు నిల్వలు పెరిగితే గ్రిడ్ స్థిరత్వంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. సరఫరా పెరగడం వల్ల సింగరేణి ఆదాయం పెరగడంతో పాటు కార్మికులకు, రాష్ట్ర ఖజానాకు చేకూరే లబ్ధి పెరుగుతుంది.

వర్షాలు తగ్గడం సింగరేణి గనుల తవ్వకానికి అనుకూలించే సమయం కావడంతో, అధికారులు సమన్వయంతో పనిచేసి రోజువారీ 1.9 లక్షల టన్నుల మార్కును చేరుకోవాలని యజమాన్యం స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More