SIR Enumeration Forms : డేట్ దగ్గర పడింది.. ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారమ్స్ వెంటనే ఇవ్వండి

SIR Enumeration Forms : భారత ఎన్నికల సంఘం గడువును రెండుసార్లు పొడిగించినప్పటికీ తెలంగాణలో 75 లక్షలకు పైగా ఓటర్లు తమ ఎస్ఐఆర్ గణన పత్రాలను ఇంకా సమర్పించలేదు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులలో అత్యధిక సంఖ్య హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

Published on: Aug 7, 2026, 11:18:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని ఓటర్లు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కోసం తమ గణన పత్రాలను పూర్తి చేయడంలో చాలామంది లైట్ తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్య ఎన్నికల కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆగస్టు 5 వరకు ఏకంగా 75,20,544 మంది ఓటర్లు తమ ఫారాలను బీఎల్‌ఓలకు ఇంకా సమర్పించాల్సి ఉంది.

సర్
సర్

వీటిలో అన్ని జిల్లాలలోకెల్లా అత్యధికంగా హైదరాబాద్‌లో 20,02,774 మంది ఓటర్లు తమ ఫారాలను ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వరుసగా 13,14,710, 11,09,751 ఫారాలు ఇంకా డిజిటలైజ్ కావాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యల్పంగా 26,202, 27,624, 36,010 మంది ఓటర్లు ఉన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల విషయానికొస్తే, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు, ఎన్నికల అధికారులు, నివాస సంక్షేమ సంఘాలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్ల నుంచి స్పందన సరిగా లేదు.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన ప్రజలు ముఖ్యంగా కూకట్‌పల్లి , దిల్‌సుఖ్‌నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, సెరిలింగంపల్లి, వనస్థలిపురం వంటి ప్రాంతాలలో నివసిస్తున్న వారు నగరంలో తమ ఓట్లను నిలుపుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

గత ఐదు రోజుల్లో హైదరాబాద్‌లో ఫారాల సమర్పణ, డిజిటైజేషన్ ఆగస్టు 1న 56.79 శాతం నుండి ఆగస్టు 5 నాటికి 57.72 శాతానికి స్వల్పంగా పెరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఫారాల డిజిటైజేషన్ 63.81 శాతం నుండి 64.46 శాతానికి, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 61.85 శాతం నుండి 62.75 శాతానికి పెరిగింది.

ఈసీఐ జారీ చేసిన సవరించిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 10 వరకు బీఎల్‌ఓలకు గణన పత్రాలను సమర్పించవచ్చు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ఆగస్టు 10 నాటికి పూర్తి చేస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాలు ఆగస్టు 17న ప్రచురిస్తారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఉంటుంది.

క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 మధ్య జరుగుతుంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న ప్రచురిస్తారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను జూన్ 25న చేపట్టగా, తొలి గడువు జూలై 24గా నిర్ణయించారు. ఆ గడువును ఆగస్టు 3కి, ఆ తర్వాత ఆగస్టు 10కి సవరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More