...
...
Next Story

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం - కేటీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావును కూడా సిట్ విచారించింది.

Published on: Jan 22, 2026 04:15 PM IST
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారించగా…తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని ఆదేశించింది.

కేటీఆర్
కేటీఆర్

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. గత బీఆర్ఎస్ హయాంలో కొందరు అధికారులు, నేతలు ట్యాంపింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ… విచారణ కూడా జరిపిస్తోంది. ఇందుకోసం ఇటీవలనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేసింది.

ఇటీవలే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ తర్వాత బయటికి వచ్చిన హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ… అడిగిందే అడిగారని కొత్తగా ఏం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నామనే కారణంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారని అన్నారు. విచారణ పేరుతో వేధించినా…. ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

అయితే హరీశ్ రావు విచారణ జరిగిన రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ కావటం హాట్ టాపిక్ గా మారింది. అయితే సిట్ నోటీసులను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

“ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. రెండేళ్లుగా దర్యాప్తు బృందం కొండనుతవ్వి ఎలుకను కూడా పట్టలేదు. అధికారులు మారుతున్నారు కానీ ఆధారాలు చూపించడం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతకుముందే చెప్పారు” అని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe