మెుయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరుగురికి పాజిటివ్.. ఇందులో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా

మెుయినాబాద్ డ్రగ్స్ కేసు సంచలన సృష్టిస్తోంది. ఆరుగురికి పాజిటివ్ రాగా.. ఇందులో ప్రముఖులు ఉన్నారు. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.

Published on: Mar 15, 2026 12:56 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని మెయినాబాద్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. పాజిటివ్ వచ్చిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా 11 మందిని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో మాదకద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలపై అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మెుయినాబాద్ డ్రగ్స్ కేసు
మెుయినాబాద్ డ్రగ్స్ కేసు

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలింది. అయితే శనివారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగెటివ్ వచ్చింది. కానీ రక్త పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పోలీసు బృందాన్ని గమనించి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.

రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఆ ఫామ్‌హౌస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందినది. ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం మేరకు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్, పోలీసు బృందం శనివారం రాత్రి దాడి చేశాయి. ఈ పార్టీకి రియల్టర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. పాల్గొన్న వారిలో ఒక మహిళ కూడా ఉంది. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్​ హౌస్​ మెుయినాబాద్​ అజీజ్​నగర్​ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం, డ్రగ్స్​ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్​ హైస్​పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్​ టీమ్​, ఎస్​ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.

కాగా పార్టీలో చిక్కిన వారికి పోలీసులు డ్రగ్స్​ కిట్​తో టెస్టింగ్​ నిర్వహించారు. రోహిత్​ రెడ్డి, రితేశ్​ రెడ్డి, నమిత్, రవితో పాటు అర్జున్​ రెడ్డికి ఈ టెస్టింగ్​లో పాజిటివ్​గా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఎంపీ మహేశ్‌కు కూడా పాజిటివ్‌ తేలింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More