22ఏలో చేరిన భూముల సమస్యలకు పరిష్కారం.. బై-నంబర్లు ఇస్తామని సీఎం హామీ
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా22ఏ భూముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
నిషేధిత జాబితాల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిషేధిత జాబితా (22 A) చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కోర్ అర్బన్ ప్రాంత పరిధిలో హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నిషేధిత జాబితాలో పెట్టిన భూముల సమస్యను ప్రస్తావించారు. 'ఏదైనా కారణంగా మీ భూమి 22Aలో చేరి ఉంటే, కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవు. నేను హామీ ఇస్తున్నా. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి సర్వే నంబర్‌లో వచ్చిన మొత్తం భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. కోర్టు కేసులున్న స్థలాల వరకు పక్కనపెట్టి మిగతా వాటికి బైనెంబర్లు ఇచ్చి పరిష్కరిస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కూకట్‌పల్లి ప్రాంత ప్రజలకు ఏం కావాలన్నా పనులు చేయించుకోవాని సీఎం అన్నారు. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, విద్య కోసం పాఠశాలలు, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అవసరమున్న పరిశ్రమల విషయంలోనైనా నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలన్నారు.
'అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు కూడా గత పాలనను, ఈ రెండేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలి. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వేటినీ నిలిపివేయలేదు. అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం రాష్ట్రంలో 3.28 కోట్ల మంది ప్రజలకు ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రూ. 500 లకే సిలిండర్ అందజేస్తున్నాం. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశాం.' అని సీఎం వివరించారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఉద్యోగ, ఉపాధి కోసం చదువుల కోసం వెళ్లేవారు నెలకు ఆరేడు వేలు ఆదా చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆర్టీసీకి 12 వేల కోట్లు చెల్లించామన్నారు. స్వయం సహాయక సంఘాలు 65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇచ్చి రూ. 2500 కోట్ల వడ్డీ చెల్లించామన్నారు.
మహిళా సంఘాల పేరిట వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకిప్పించామని రేవంత్ రెడ్డి చెప్పారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం కల్పించామన్నారు. ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులను విక్రయించుకోవడానికి శిల్పారామంలో మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా బజార్ల ఏర్పాటుకు విలువైన స్థలమిచ్చామని తెలిపారు.
రెండేండ్లు తిరిగేలోపు ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల్లో రెండేళ్లు తిరిగేలోపు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చెప్పారు. కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమిలో మంచి సంకల్పంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మించే అద్భుతమైన కార్యక్రమం చేపట్టామన్నారు. నగరంలో నిరుపేదలు ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో వారికి అక్కడే ఇండ్లు ఇవ్వాలని సంకల్పించామన్నారు.
పేదల కోసం నిర్మించే ఇండ్లకయ్యే రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. ఇప్పుడు నిర్మించే ఇళ్లకు సంబంధించి నిరుపేదలకు స్థలం మొత్తం ఉచితంగా అందిస్తున్నామన్నారు. నిర్మాణానికి అయ్యే వ్యయంలో ఐదారు లక్షలు లబ్ధిదారులు భరిస్తే నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎలా సాగుతుందో ఎప్పుడైనా పరిశీలించే హక్కుదారులవుతారని చెప్పారు.
'నిరుపేదలు ఉండడానికి సొంత ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. సొంతింటి కల నెరవేరడానికి నూటికి నూరు శాతం అండగా నిలబడుతాం. మొదటి విడతగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ లాంటి అత్యధికంగా పేదలు ఉండే ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి పనులు చేయడానికి ఇక్కడికి వలసలు వచ్చిన ప్రాంతాల్లో ఉండటానికి మంచి ఇల్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో ఏదైనా పని చేయాలంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్.. ఇలా తిరగడానికే సమయం సరిపోయేది. అందుకే ప్రజల సౌలభ్యం కోసం సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశాం.' అని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


