హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ, అత్యవసర ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నగరంలోని పలు కీలక రూట్లలో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2026, జూన్ 20వ తేదీన (శనివారం) ఈ రద్దు వర్తిస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

కాచిగూడ-ధోన్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న ఈ ట్రాక్ నిర్వహణ పనుల వల్ల కింది రెండు ప్రధాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. రైలు నెంబర్ 47222 (మేడ్చల్ – లింగంపల్లి) సాధారణంగా ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 07:40 గంటలకు మేడ్చల్‌లో బయలుదేరి మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ మీదుగా ఉదయం 09:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. జూన్ 20న ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు.
రైలు నెంబర్ 47252 (ఉమ్దానగర్ – సికింద్రాబాద్) రైలు ప్రతిరోజూ ఉదయం 11:20 గంటలకు ఉమ్దానగర్‌లో బయలుదేరి ఫలక్‌నుమా, మలక్‌పేట, కాచిగూడ మీదుగా మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీస్‌ను కూడా అధికారులు రద్దు చేశారు. రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా, వేగంగా, సాఫీగా సాగించేందుకు ఈ ముందస్తు నిర్వహణ పనులు ఎంతో అవసరమని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ట్రాక్ పటిష్టత బాగుంటేనే భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, నిత్యం ఈ రూట్లలో ప్రయాణించే వారు ఈ మార్పులను గమనించాలని రైల్వే శాఖ కోరింది. శనివారం ఉదయం పూట కార్యాలయాలకు లేదా ఇతర పనులకు వెళ్లేవారు ఇబ్బంది పడకుండా తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయంగా మెట్రో లేదా ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ రైలు టైమింగ్స్ మార్పు
మరోవైపు నాగర్ కోయిల్-కాచిగూడ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 16354 ఎక్స్ ప్రెస్ టైమింగ్స్‌లో మార్పులు జరిగాయి. ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. లైన్ల ఆధునీకరణ, ఇతర కార్యాచరణ, సిగ్నలింగ్ అవసరాల దృష్ట్యా ఈ రైలు వేళలను సవరించారు. ఈ రైలు 20వ తేదీన మధ్యాహ్నం 12: 20 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. ఈ నెల 20న మధ్యాహ్నం 12:20 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి బయల్దేరే నెంబర్ 16354 ఎక్స్ ప్రెస్ వల్లియూర్, తిరునెల్వేలి, కోవిల్ పట్టి, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, కరూరు, నామక్కల్, రాశిపురం, సేలం, జోలార్ పేట, వనియంబాడి, గుడియాత్తం, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్ మీదుగా కాచిగూడ వస్తుంది.
{{/usCountry}}మరోవైపు నాగర్ కోయిల్-కాచిగూడ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 16354 ఎక్స్ ప్రెస్ టైమింగ్స్‌లో మార్పులు జరిగాయి. ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. లైన్ల ఆధునీకరణ, ఇతర కార్యాచరణ, సిగ్నలింగ్ అవసరాల దృష్ట్యా ఈ రైలు వేళలను సవరించారు. ఈ రైలు 20వ తేదీన మధ్యాహ్నం 12: 20 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. ఈ నెల 20న మధ్యాహ్నం 12:20 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి బయల్దేరే నెంబర్ 16354 ఎక్స్ ప్రెస్ వల్లియూర్, తిరునెల్వేలి, కోవిల్ పట్టి, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, కరూరు, నామక్కల్, రాశిపురం, సేలం, జోలార్ పేట, వనియంబాడి, గుడియాత్తం, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్ మీదుగా కాచిగూడ వస్తుంది.
{{/usCountry}}