ప్రయాణికుల సౌకర్యం కోసం, రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. చర్లపల్లి, సంత్రాగచ్చి, తిరువణ్ణామలై(అరుణాచలం) మధ్య నడిచే ఈ స్పెషల్ రైళ్లు 2026 డిసెంబర్, 2027 జనవరిలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పండుగలు, రద్దీ సీజన్లలో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది.
పొడిగింపు రైళ్ల షెడ్యూల్ ఇలా :
- చర్లపల్లి నుంచి సంత్రాగచ్చి(ట్రైన్ నెంబర్ 07221 )కి ప్రతి శనివారం నడుస్తుంది. 2026 డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 26 వరకు మొత్తం 4 సర్వీసులు నడుపుతారు.
- 07222 నంబరు రైలు సంత్రాగచ్చి నుంచి చర్లపల్లికి ప్రతి ఆదివారం నడుస్తుంది. 2026 డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 27 వరకు మొత్తం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- 07001 నంబరు రైలు చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి ప్రతి గురువారం నడుస్తుంది. 2026 డిసెంబర్ 31 నుంచి 2027 జనవరి 21 వరకు మొత్తం 4 సర్వీసులు నడుపుతారు.
- 07002 నంబరు రైలు తిరువణ్ణామలై(అరుణాచలం) నుంచి చర్లపల్లికి ప్రతి శుక్రవారం నడుస్తుంది. 2027 జనవరి 1 నుంచి జనవరి 22 వరకు మొత్తం 4 సర్వీసులు నడుపుతారు.

ఈ పొడిగించిన ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులంతా సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని సౌకర్యవంతంగా రాకపోకలు సాగించాలని సూచించింది.
దానాపూర్ - ఎర్నాకుళం ప్రత్యేక రైళ్లు :
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు…. మరికొన్ని ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
- ప్రయాణికుల సౌకర్యం కోసం దానాపూర్, ఎర్నాకుళం మధ్య ఒక్కో సర్వీసు చొప్పున ప్రత్యేక రైళ్లను నడుపుతారు. 03243 నంబరు రైలు దానాపూర్ నుంచి ఎర్నాకుళం వైపు నడుస్తుంది. ఆదివారం (నవంబర్ 29, 2026) ఒక సర్వీసు అందుబాటులో ఉంటుంది.
- 03244 నంబరు రైలు ఎర్నాకుళం నుంచి దానాపూర్ వైపు నడుస్తుంది. గురువారం (డిసెంబర్ 3, 2026) ఒక సర్వీసు నడుస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లకు ఇరువైపులా పలు కీలక స్టేషన్లలో హాల్ట్ కల్పించారు. అరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్ ఛియోకి, సత్నా, కట్నీ, జబల్పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్హర్షా స్టేషన్లతో పాటు తెలంగాణలో రామగుండం, వరంగల్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో నిలుస్తాయి. ఆ తర్వాత పెరంబూర్, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా స్టేషన్ల మీదుగా సాగుతాయి. ఈ రైళ్లలో స్లీపర్, సెకండ్ క్లాస్ చైర్ కార్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.