తిరుపతి, అరుణాచలం వెళ్లే భక్తులకు అప్డేట్.. విశాఖ నుంచి స్పెషల్ ట్రైన్స్.. షెడ్యూల్, స్టాపేజీల వివరాలు

తిరుపతి, అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పూర్తి షెడ్యూల్, స్టాపేజీల వివరాలు చూడండి.

Published on: Nov 20, 2026, 13:50:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక దీపోత్సవం నేపథ్యంలో అరుణాచలం వెళ్లే ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు, తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు.

సౌత్ కోస్ట్ స్పెషల్ ట్రైన్స్
సౌత్ కోస్ట్ స్పెషల్ ట్రైన్స్

తిరుపతి - విశాఖపట్నం ప్రత్యేక రైలు

రైలు నంబర్ 07423 తిరుపతి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ ట్రైన్ ఆన్ డిమాండ్ (TOD) ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు నవంబర్ 21, 2026 రాత్రి 9:50 గంటలకు తిరుపతి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.మరుసటి రోజు అంటే నవంబర్ 22, 2026 మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

విశాఖపట్నం - తిరుపతి ప్రత్యేక రైలు

విశాఖపట్నం నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వెళ్లే భక్తుల కోసం రైలు నంబర్ 07424 ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు నవంబర్ 24 రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

అరుణాచలం ట్రైన్

తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం)లో జరిగే కార్తీక దీపోత్సవ వేడుకల్లో పాల్గొనే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం రైల్వే శాఖ సింగిల్ రౌండ్ ట్రిప్ ప్రత్యేక రైలును ప్రకటించింది.

రైలు నంబర్ 08579 నవంబర్ 22, 2026 (ఆదివారం) రాత్రి 11:50 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, నవంబర్ 23, 2026 (సోమవారం) సాయంత్రం 5:50 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరువణ్ణామలైలో దీపోత్సవ దర్శనం అనంతరం, నవంబర్ 23, 2026 (సోమవారం) రాత్రి 9 గంటలకు తిరువణ్ణామలై నుంచి బయలుదేరి, నవంబర్ 24, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు మరియు కాట్పాడి స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ కల్పించారు.

పండుగలు, పుణ్యక్షేత్రాల రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More