...
...
Next Story

Special Trains : ఈ తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా స్పెషల్ ట్రైన్స్

Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, కాజీపేట, వికారాబాద్, కాచిగూడ మీదుగా బెంగళూరు, ప్రయాగ్‌రాజ్, సహర్సా, బరౌనీ మధ్య రైళ్లు నడవనున్నాయి.

Published on: Nov 26, 2026, 13:49:11 IST
Advertisement

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, అలాగే బెంగళూరు వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. కాజీపేట, సికింద్రాబాద్, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్ల మీదుగా నడవనున్న ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు చూడండి. డిసెంబర్ నెలలో ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే 10 సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

స్పెషల్ ట్రైన్స్

దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్
దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్

04151 ప్రయాగ్‌రాజ్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు 16.12.2026 నుండి 23.12.2026 వరకు రెండు సర్వీసులు నడుస్తాయి.

04152 ఎస్‌ఎంవీటీ బెంగళూరు – ప్రయాగ్‌రాజ్ మధ్య 19.12.2026 నుండి 26.12.2026 వరకు 2 సర్వీసులు నడుస్తాయి.

ఈ రైళ్లు ఇరువైపులా బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక స్టేషన్లతో పాటు ఇటార్సీ, నాగ్‌పూర్, బల్హర్షా తదితర స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

04171 సుబేదార్‌గంజ్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు నడుమ 11.12.2026 నుండి 25.12.2026 వరకు మూడు స్పెషల్ సర్వీసులు నడుస్తాయి.

04172 ఎస్‌ఎంవీటీ బెంగళూరు – సుబేదార్‌గంజ్ మధ్య 14.12.2026 నుండి 28.12.2026 వరకు 3 సర్వీసులు నడుపుతారు.

ఈ ట్రైన్లు సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంకతో పాటు సత్నా, కట్ని, జబల్‌పూర్, నాగ్‌పూర్ తదితర స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో 1ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

వన్ వే స్పెషల్ ట్రైన్స్

05281 బరౌనీ – బెంగళూరు కంటోన్మెంట్ వరకు 30.11.2026 వన్ సర్వీస్ నడవనుంది. ఈ ట్రైన్ రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్, వికారాబాద్, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక స్టేషన్లలో ఆగుతుంది. సామాన్య ప్రయాణికుల కోసం ఇందులో పూర్తిగా జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks