...
...
Next Story

SCR Special Trains : చర్లపల్లి - షాలిమార్ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు - వెళ్లే రూట్స్ ఇవే

South Central Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి - షాలిమార్ మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి రానున్నాయి. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published on: Apr 02, 2026 09:55 PM IST
Advertisement

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. వేసవి వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య వారపు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ వివరాలను ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

వీక్లీ స్పెషల్ ట్రైన్స్ - వివరాలు:

  • దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఏప్రిల్ 4 తేదీ నుంచి జూన్ 27 వరకూ చర్లపల్లి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
  • చర్లపల్లి - షాలిమార్ (ట్రైన్ నెంబర్ 08046) మధ్య నడిచే రైళ్లు… ఉదయం 6.55కు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 నిమిషాలకు ఒడిశాలోని షాలిమార్ కు చేరుకుంటాయి. మొత్తం 13 సర్వీసులుంటాయి.
  • షాలిమార్ - చర్లపల్లి మధ్య (ట్రైన్ నెంబర్ 08045 ) మధ్య మరో 13 ప్రత్యేక రైళ్లుంటాయి. షాలిమార్ నుంచి అర్ధరాత్రి 12.30కు బయలుదేరే ప్రత్యేక రైళ్లు… తర్వాతి రోజు తెల్లవారుజామున 4.30కు చర్లపల్లి చేరుకుంటాయి. ఈ రైళ్లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయి.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

మొత్తం కలిపి ఈ రూట్లలో 26 ప్రత్యేక రైళ్లుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు రెండు వైపులా తెలుగు రాష్ట్రాల్లో కాజీపేట, వరంగల్, మహబాబూబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.

అంతేకాకుండా బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్, భద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచ్చి స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, క్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe