...
...
Next Story

గోల్డ్ లోన్స్‌లో సౌత్ ఇండియానే టాప్.. తెలంగాణ, ఏపీలోనూ భారీగా రుణాలు!

సామాన్యుడికి డబ్బు అవసరం వస్తే మెుదటగా గుర్తుకు వచ్చేది గోల్డ్ లోన్. అయితే ఈ గోల్డ్ లోన్స్‌లో దక్షిణ భారతదేశం టాప్‌లో ఉంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా కూడా ఎక్కువే.

Published on: Dec 4, 2025, 15:24:18 IST
Advertisement

అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఠక్కున గుర్తుకువచ్చేది గోల్డ్ లోన్. బంగారం రుణాలలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. మిగతా రుణాలతో పోల్చుకుంటే గోల్డ్ లోన్ రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా పత్రాలు అవసరం ఉండవు. డబ్బులు కూడా వెంటనే పడిపోతాయి. దీంతో బంగారం రుణాలకు జనాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ రుణాల్లో తెలంగాణ, ఏపీ వాటా కూడా ఎక్కువే ఉందని నివేదికలు చెబుతున్నాయి.

గోల్డ్ లోన్స్
గోల్డ్ లోన్స్

సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం బంగారు రుణాలు రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు మార్కెట్‌లో 76.55 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ బంగారు రుణ మార్కెట్‌లో దక్షిణాది రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి

రూ.14.5 లక్షల కోట్లలో టాప్ 10 రాష్ట్రాలు కలిపి రూ.13.2 లక్షల కోట్ల గోల్డ్ లోన్స్ కలిగి ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్రమే బంగారం రుణాలు తీసుకున్నాయి. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో 3.63 కోట్ల మంది వినియోగదారులు రూ.6 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను పొందారు. ఇది గత సంవత్సరం కంటే రుణ విలువలో 53 శాతం వృద్ధిని, కస్టమర్ బేస్‌లో 16 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

ఒక్కో కస్టమర్‌కు సగటు రుణం 2023 సెప్టెంబర్‌లో రూ.1.1 లక్షల నుండి 2025 సంవత్సరం రూ.1.64 లక్షలకు పెరిగింది. రూ.1 లక్ష కంటే తక్కువ రుణ ఖాతాలు గణనీయంగా తగ్గాయి. రూ.1 లక్ష కంటే తక్కువ రుణాల వాటా రెండేళ్లలో 25.9 శాతం నుండి 14.4శాతానికి తగ్గింది. రూ.5 లక్షల కంటే ఎక్కువ రుణాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. బంగారం ధరలు పెరగడం వల్ల తాకట్టు పెట్టిన లోహంపై మంజూరు చేసిన మొత్తాలు పెరగడం కూడా ప్రధాన కారణంగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe