Telangana Monsoon 2026 : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈసారి కొంచెం ఆలస్యంగానే వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యం కానుంది. జూన్ ఐదో తేదీ దాటిన తర్వాతే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ముందుగా వచ్చిన అంచనాల ప్రకారం…. మే నెల చివరి నాటికే తెలంగాణ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25వ తేదీ నాడే ఇవి తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం ఒక్కసారిగా తగ్గింది.
జూన్ మొదటి వారంలో….
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే నెల ఐదో తేదీ నుంచి పదో తేదీ మధ్యలో రుతుపవనాలు రాష్ట్రంలోకి రావొచ్చు. ఈ ఏడాది వానాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పడే వర్షాలపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యవసాయ రంగంపై, ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
సాధారణంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది.
{{/usCountry}}సాధారణంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది.
{{/usCountry}}గతేడాది వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే…. మే 24వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు, మే 31వ తేదీ నాటికి తెలంగాణను పలకరించాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో మే నెలాఖరుకల్లా రాష్ట్రంలో వర్షాగమనం మొదలయ్యేందుకు బలమైన సానుకూలతలు కనిపించాయి. దీంతో ముందుగానే వర్షాలు ఉంటాయని భావించారు. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం ఒక్కసారిగా తగ్గింది. దీంతో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాక కొంచెం ఆలస్యం కానుంది.