Monsoon Update 2026 : వర్షాలపై ఎల్‌నినో ఎఫెక్ట్ - ఆలస్యం కానున్న రుతుపవనాల రాక..! తెలంగాణను ఎప్పుడు తాకుతాయంటే..?

Telangana Monsoon 2026 : తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. ఎల్‌నినో ప్రభావంతో కదలికలు మందగించడమే దీనికి కారణం. జూన్ ఐదో తేదీ తర్వాతే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Published on: May 26, 2026, 12:10:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Monsoon 2026 : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈసారి కొంచెం ఆలస్యంగానే వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యం కానుంది. జూన్‌ ఐదో తేదీ దాటిన తర్వాతే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

రుతుపవనాలు
రుతుపవనాలు

ముందుగా వచ్చిన అంచనాల ప్రకారం…. మే నెల చివరి నాటికే తెలంగాణ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25వ తేదీ నాడే ఇవి తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం ఒక్కసారిగా తగ్గింది.

జూన్ మొదటి వారంలో….

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే నెల ఐదో తేదీ నుంచి పదో తేదీ మధ్యలో రుతుపవనాలు రాష్ట్రంలోకి రావొచ్చు. ఈ ఏడాది వానాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పడే వర్షాలపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యవసాయ రంగంపై, ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

సాధారణంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది.

గతేడాది వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే…. మే 24వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు, మే 31వ తేదీ నాటికి తెలంగాణను పలకరించాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో మే నెలాఖరుకల్లా రాష్ట్రంలో వర్షాగమనం మొదలయ్యేందుకు బలమైన సానుకూలతలు కనిపించాయి. దీంతో ముందుగానే వర్షాలు ఉంటాయని భావించారు. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం ఒక్కసారిగా తగ్గింది. దీంతో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాక కొంచెం ఆలస్యం కానుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More