నా తల్లిని అన్నారు.. మీ తల్లిని కాదు.. హరీశ్‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా మెుదలయ్యాయి. మాజీ మంత్రి హరీశ్ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఈ సందర్భంగా సీరియస్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న సంఘటనలు సభలో రెండో రోజు కూడా తీవ్ర దుమారాన్ని లేపాయి. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS), అధికార కాంగ్రెస్ పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న తీవ్ర విమర్శలు, సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు శాసనసభలో వేడిని పుట్టించాయి.

రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. గురువారం శాసనసభ వద్ద పోలీసుల ప్రవర్తనను నిరసిస్తూ వారు ఈ విధంగా తమ నిరసన తెలిపారు. సభలో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావ్ అధికార పక్షం తీరుపై నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను పోలీసులు అవమానించారని, దీనిపై కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చీర లాగడం, గొంతుపై నొక్కడం విషయాలను మాట్లాడారు. మహిళా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, తిరిగి వారిపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ సభను కౌరవ సభతో పోల్చారు.
హరీశ్ రావ్ విమర్శలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర అసహనం, భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం మహిళా సభ్యుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, శాసనసభ్యుల వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. వారు నా చెల్లెలు అని చెప్పారు. "మీకు కాదు ఆవేశం ఉండాల్సింది, స్పీకర్ స్థానంలో ఉన్న నాకు ఉండాలి" అని వ్యాఖ్యానించిన ఆయన, తన వద్దకు వచ్చి కొందరు చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. నా తల్లిని మాటలు అన్నారని హరీశ్ రావుపై సీరియస్ అయ్యారు. సభలోని మహిళా సభ్యులంతా తనకు సోదరీమణులతో సమానమని, సభ వద్ద జరిగిన సంఘటనపై సమగ్ర నివేదిక రాగానే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, స్పీకర్‌ను బెదిరించే రీతిలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని మండిపడ్డారు. సభా సంప్రదాయాలను విస్మరించి సభాపతి స్థానాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన విషయమన్నారు. అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ప్రతి సంఘటన వీడియో రికార్డుల్లో భద్రంగా ఉందని, ప్రజలందరికీ నిజానిజాలు తెలుస్తాయని తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ తదితరులు కూడా బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులను అసెంబ్లీ లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, సభ నియమ నిబంధనలను ఉల్లంఘించి సభాపతిపై దాడికి దిగేలా మాట్లాడారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


