Telangana Special TET 2026 Notification : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం త్వరలోనే ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 21న జారీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
సెప్టెంబరులో పరీక్షలు…

ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. సెప్టెంబరు 7వ తేదీ నుంచి 11వ తేదీల మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. సిలబస్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టెట్ అర్హత సాధించాల్సిన ఇన్‌సర్వీస్ టీచర్లు దాదాపు 20 వేల మంది వరకు ఉండవచ్చని ఒక అంచనా.
నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేసే ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావడం తప్పనిసరి ఏమీ కాదు. అయితే…. నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు మాత్రం టెట్ అర్హత ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది.
గత నెలలో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు నిన్ననే విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా…. పరీక్షలో కేవలం 8,809 మంది ఉపాధ్యాయులు పాస్ కాగా, 14,814 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు
గత ఏడాది 50 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈసారి కేవలం 37.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నెలలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…. మరోసారి ప్రత్యేకంగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండుసార్లు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి స్పెషల్ టెట్ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జులై 21న విడుదలయ్యే నోటిఫికేషన్ లో దరఖాస్తు తేదీలతో పాటు ఇతర అంశాలను వెల్లడిస్తారు.
{{/usCountry}}ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండుసార్లు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి స్పెషల్ టెట్ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జులై 21న విడుదలయ్యే నోటిఫికేషన్ లో దరఖాస్తు తేదీలతో పాటు ఇతర అంశాలను వెల్లడిస్తారు.
{{/usCountry}}