తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల (In-Service Teachers) కోసం ఏడాదికి రెండు సార్లు ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Special TET) నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న టీచర్లు సైతం కచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందేనంటూ సెప్టెంబరు 2025లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మొదట రెండేళ్ల గడువు ఇచ్చినప్పటికీ, ఇటీవల అత్యున్నత న్యాయస్థానం దీనిని మరో ఏడాది పొడిగించింది. దీని ప్రకారం.. ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ 2028 ఆగస్టు నాటికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి అయింది.
దేశంలోని కొన్ని రాష్ట్రాలు తమ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహిస్తున్నాయని, అదే తరహాలో తెలంగాణలోనూ జరపాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఉపాధ్యాయుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుద్యోగుల కోసం సాధారణంగా ఏటా నిర్వహించే రెండు టెట్‌లతో సంబంధం లేకుండా, పనిచేస్తున్న టీచర్ల కోసం ప్రత్యేకంగా పరీక్షలు జరపాలని నిర్ణయించింది.
విద్యాశాఖ వర్గాల అంచనా ప్రకారం.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు ఇంకా టెట్ అర్హత లేదు.
2026 జనవరిలో జరిగిన టెట్ పరీక్షకు వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 65,605 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా.. అందులో 37,893 మంది ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన వారు రాబోయే పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంది.
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఈనెల 15వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పరీక్ష రాయడానికి నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి మొత్తం 1.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం సర్వీస్‌లో ఉండి టెట్ కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు 28,149 మంది ఉన్నారు.
{{/usCountry}}రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఈనెల 15వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పరీక్ష రాయడానికి నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి మొత్తం 1.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం సర్వీస్‌లో ఉండి టెట్ కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు 28,149 మంది ఉన్నారు.
{{/usCountry}}ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ఉపాధ్యాయులకు భవిష్యత్తులో ప్రమోషన్లు పొందడానికి, అలాగే సుప్రీంకోర్టు గడువులోగా ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగ భద్రతను కాపాడుకోవడానికి ఈ ప్రత్యేక టెట్ ఎంతగానో దోహదపడనుంది.