హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు.. వాక్-ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూల్ ఇదే
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్‌లో పలు సబ్జెక్టులలోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూన్ 9 నుండి 11 వరకు ఇంటర్వ్యూల షెడ్యూల్ ఉంది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్‌లో కాంట్రాక్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలుడింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పాఠశాల యంత్రాంగం ప్రకటించింది.

ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి పలు సబ్జెక్టులలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల కాలపరిమితి (జూన్ 22 నుండి డిసెంబర్ 26 వరకు) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT - కంప్యూటర్ సైన్స్): 01
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT - వివిధ సబ్జెక్టులు): 13
- ప్రైమరీ టీచర్ (PRT): 10 పోస్టులు
- కౌన్సిలర్ (Counsellor): 01 పోస్టు
వాక్-ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూల్
క్యాంపస్ స్కూల్‌లో జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హులైన అభ్యర్థులు తమ సబ్జెక్టును బట్టి నిర్ణీత తేదీల్లో హాజరుకావాలి. జూన్ 9న TGT (సోషల్ సైన్స్, ఇంగ్లీష్), PRT (ప్రీ-ప్రైమరీ, EVS) ఇంటర్వ్యూలు ఉంటాయి. జూన్ 10న TGT/PRT (సైన్స్, తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్), జూన్ 11PGT (కంప్యూటర్ సైన్స్), కౌన్సిలర్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ (PET) పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపికైన ఉపాధ్యాయులకు హోదాని బట్టి ఆకర్షణీయమైన వేతనాలు అందించనున్నారు. పీజీటీ కంప్యూటర్ సైన్స్ నెలకు రూ. 48,000, టీజీటీ, కౌన్సిలర్ నెలకు రూ. 45,000, ప్రైమరీ టీచర్ నెలకు రూ. 35,000 వరకు జీతం ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9:00 గంటల నుండి 10:00 గంటల లోపు గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా వస్తే అనుమతించరు. పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు, నివాస ధృవీకరణ పత్రం(ఆధార్/ఓటర్ ఐడీ మొదలైనవి), అన్ని విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, స్వయంగా ధృవీకరించిన జిరాక్స్ కాపీల సెట్ తీసుకురావాలి.
అభ్యర్థులు ఇంటర్వ్యూకు వెళ్లే ముందు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ (https://uohyd.ac.in) లో లభించే పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు నమూనాను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. హైదరాబాద్‌లోనే కేంద్రీయ వర్సిటీ వాతావరణంలో పనిచేయాలనుకునే టీచింగ్ అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


