తిరుమలకు వెళ్లే తెలుగు ప్రయాణికులకు శుభవార్త - కరీంనగర్, విజయవాడ మీదుగా తిరుచానూరుకు 12 ప్రత్యేక రైళ్లు, హాల్ట్ లిస్ట్

తెలుగు రాష్ట్రాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాందేడ్ - తిరుచానూరు మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు జూలై 21 నుంచి ఆగస్టు 26 వరకు అందుబాటులో ఉంటాయి.

Published on: Jul 16, 2026, 17:56:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, సాధారణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు సౌకర్యవంతమ ప్రయాణాన్ని అందించేందుకు మహారాష్ట్రలోని హుజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరు మధ్య 12 ప్రత్యేక రైళ్లను (రైలు సంఖ్యలు 07603/07604) నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

తిరుచానూరుకు 12 ప్రత్యేక రైళ్లు
తిరుచానూరుకు 12 ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు 2026 జూలై 21వ తేదీ నుండి ఆగస్టు 26వ తేదీ వరకు పట్టాలెక్కనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే ఈ రైళ్ల వల్ల ఉత్తర తెలంగాణ భక్తులతో పాటు కోస్తాంధ్ర ప్రయాణికులకు ఎంతో లబ్ధి చేకూరనుంది.

ప్రత్యేక రైళ్లు - వివరాలు :

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం నాందేడ్ - తిరుచానూరు మధ్య రెండు దిశలలో చెరో 6 సర్వీసుల చొప్పున మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

  • రైలు నంబర్ 07603 (నాందేడ్ – తిరుచానూరు ప్రత్యేక రైలు): ఈ రైలు జూలై 21 నుంచి ఆగస్టు 25 వరకు ప్రతి మంగళవారం నాందేడ్ నుంచి బయలుదేరుతుంది. ఇది మొత్తం 6 సర్వీసులు నడుస్తాయి.
  • రైలు నంబర్ 07604 (తిరుచానూరు – నాందేడ్ ప్రత్యేక రైలు): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూలై 22 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి బుధవారం తిరుచానూరు నుంచి బయలుదేరి నాందేడ్ చేరుకుంటుంది. ఈ రూట్ లో కూడా 6 సర్వీసులను నడుపుతారు.

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో కేవలం థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు. దీనివల్ల మధ్యతరగతి ప్రయాణికులకు బడ్జెట్ ధరలోనే రిజర్వేషన్ సదుపాయం లభించడమే కాకుండా…. ఏసీ ప్రయాణాన్ని కోరుకునే వారికి కూడా మెరుగైన ప్రయాణ అనుభూతి కలుగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం రెండు వైపులా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో ఆగనున్నాయి. ఇందులో ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు , రేణిగుంట రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

"తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, విజయవాడ మీదుగా ఈ ప్రత్యేక రైలు నడపడం వల్ల ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు నేరుగా తిరుపతి పరిసర ప్రాంతాలకు చేరుకోవడానికి వీలు కలుగుతుంది," అని రైల్వే అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More