...
...
Next Story

Sri Rama Navami : కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం.. మురిసిపోయిన భక్తజనం!

Sri Rama Navami 2026 : తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో రాములవారి కళ్యాణం చూసి భక్తజనం మురిసిపోయారు.

Published on: Mar 27, 2026, 13:07:27 IST
Advertisement

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, అశేష భక్తజనం పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మెుదట శ్రీ సీతారాములను పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాములవారి కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం పెట్టే ఘట్టం పూర్తైంది. ఆ తర్వాత సీతమ్మ మెడలో రాములవారు మాంగళ్యధారణ చేశారు. ఆ తర్వాత తలంబ్రాల వేడుక నిర్వహించారు.

శ్రీసీతారాముల కళ్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియం ప్రాంగణం మార్గోగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా భద్రాచలం రాములవారి ఆలయంతోపాటుగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవస్థాన అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుమారు రూ.351 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి దేవస్థానం సమగ్ర పునర్ అభివృద్ధి పనులకు, అలాగే గోదావరి నది తీరంలో ఆధునిక సదుపాయాలతో ఘాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. ఈ పనుల ద్వారా యాత్రికులకు మెరుగైన వసతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe