తెలంగాణ : బోగస్ ఫారం-7తో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే కఠిన చర్యలు
ఫారం-7పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులు స్పందించారు. బోగస్ ఫారం 7 దరఖాస్తులు సమర్పిస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా ఇతరుల ఓట్లను అక్రమంగా తొలగించేందుకు భారీ స్థాయిలో జరుగుతున్న కుట్రలపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల తొలగింపు కోసం నకిలీ, ముందే ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

చనిపోయిన వారిని, అడ్రస్ మారిన వారిని లేదా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు చట్టబద్ధంగా ఫారం-7ను ఉపయోగిస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్, గోషామహల్, చంద్రాయణగుట్ట వంటి నియోజకవర్గాల్లో ప్రత్యర్థి ఓటర్ల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కొందరు వ్యక్తులు ముందస్తుగా ప్రింట్ చేసిన ఫారం-7 పత్రాలను సమర్పిస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీఈఓకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీఈఓ కార్యాలయం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నికల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఓట్ల తొలగింపుకు కుట్ర పన్నితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
ఓట్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో సీఈఓ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఫారం-7 దరఖాస్తు రాగానే నేరుగా ఓటు తొలగించకుండా బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
కొత్త ఓటు నమోదు లేదా చిరునామా/వివరాల మార్పు దరఖాస్తుల్లో కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు లేదా నకిలీ డిక్లరేషన్లు ఇస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల సమర్పణకు సంబంధించి నిర్ణయించిన గడువు బుధవారంతో ముగియనుంది.
గోషామహల్‌లో సమర్పించిన దరఖాస్తులపై దరఖాస్తుదారుల సంతకాలు కూడా లేకపోవడంతో, అవి పరిశీలనకు అనర్హమయ్యాయి. ముషీరాబాద్‌లో బాలచందర్ అనే వ్యక్తి 30 మంది ఓటర్లకు వ్యతిరేకంగా ఫారం-7ను సమర్పించారు, అయితే వారు ఆయా చిరునామాల్లోనే నివసిస్తున్నట్లు గుర్తించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు.
బాలచందర్ సమర్పించిన ఫారం-7 దరఖాస్తులు నిజమైన ఓటర్ల పేర్లను చట్టవిరుద్ధంగా తొలగించే ప్రయత్నమని పేర్కొంటూ.. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. గోషామహల్‌లో ఒక బూత్ స్థాయి అధికారి ఫారం-7 దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లుగా ఉన్న వీడియో గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతూ.. బీజేపీకి చెందిన ఏ బూత్ స్థాయి ఏజెంట్ కూడా అటువంటి ఫారం-7 దరఖాస్తులను సమర్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


