నంది నాటకోత్సవాలు-2025, కందుకూరి పురస్కారాలు-2026కి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం 'నంది నాటకోత్సవాలు-2025', 'కందుకూరి పురస్కారాలు-2026' కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేయాలి.

Published on: Sep 21, 2026, 14:54:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాటక సమాజాలు, కళాకారులు, రచయితలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక నంది నాటకోత్సవాలు-2025తో పాటు కందుకూరి పురస్కారాలు-2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

నంది నాటకోత్సవాలు-2025 కోసం పోటీ పడేందుకు నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు (చైల్డ్ ఆర్టిస్ట్స్/చిల్డ్రన్ ప్లేస్), కాలేజీ/యూనివర్సిటీ నాటకాలు, నాటకరంగం, ప్రదర్శన కళలపై రాసిన గ్రంథాలు/పుస్తకాల కోసం సేవలు అందించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

కందుకూరి పురస్కారాలు - 2026 నాటకరంగానికి విశేష సేవలు అందించిన పౌరాణిక, సాంఘిక నాటక కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సంస్థల నుండి ఈ పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కందుకూరి రంగస్థల ప్రతిభా పురస్కారం అందించనున్నారు. జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు అందజేస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ www.apsftvtdc.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026గా నిర్ణయించారు. హార్డ్ కాపీల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 26 సాయంత్రం లోపు ఉంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తయిన తర్వాత, ఆ ఫారమ్‌ను ప్రింట్‌అవుట్ తీసి, దానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు జతచేసి, సంతకం చేసిన అనంతరం క్రింది పేర్కొన్న చిరునామాకు అక్టోబర్ 26 నాటికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

మేనేజింగ్ డైరెక్టర్,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC),

4వ అంతస్తు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్,

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS),

విజయవాడ – 520013.

దరఖాస్తుదారులు నమోదు చేసేటప్పుడు తమ నాటకం లేదా గ్రంథానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, ప్లే-లిస్ట్, కళాకారుల వివరాలు, గత ప్రదర్శనల వివరాలు/వీడియో లింకులు స్పష్టంగా సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వారు స్థానికత, వారి సేవల సమయాన్ని ధృవీకరించే పత్రాలను తప్పనిసరిగా జతచేయాలి.

పోస్ట్ ద్వారా పంపే హార్డ్ కాపీలు నిర్దేశిత గడువు అక్టోబర్ 26 దాటితే పరిశీలించరు. పూర్తి వివరాలకు www.apsftvtdc.in పోర్టల్‌ను చూడవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More