AP Pension Status : కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారా..? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

AP NTR Bharosa Pension Status : ఎన్టీఆర్ భరోసా పింఛను దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. అయితే దరఖాస్తుదారులు… వారి అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

Published on: Sep 21, 2026, 10:23:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP NTR Bharosa Pension Status : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం’కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి అంచనాలకు మించి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ విడతలో దాదాపు 13 లక్షలకుపైగా దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ వెసులుబాటు కల్పించింది.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ పోర్టల్ ఏపీ సేవా ఆఫీస్ పోర్టల్ ( https://apseva.ap.gov.in/#/home ) ను ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'Service Request Status Check' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ పింఛను అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. మీ పింఛను దరఖాస్తు సంఖ్య తప్పనిసరిగా 'PNS' అనే అక్షరాలతో ప్రారంభమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకవాలి.
  • వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయగానే మీ దరఖాస్తు ప్రస్తుత స్థితి…. అది ఏ అధికారి పరిశీలనలో ఉందో స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.
  • ప్రస్తుత స్టేటస్ ఆధారంగా మీ అప్లికేషన్ విషయంలో ఓ క్లారిటీకి రావొచ్చు.

మరోవైపు లక్షలాది దరఖాస్తుల తనిఖీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 24వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి దరఖాస్తునూ అర్హత ప్రమాణాల ప్రకారం క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

పింఛను దరఖాస్తుదారులు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని సచివాలయానికి పిలిచినప్పుడు సరైన పత్రాలు అందించాలి. ఒకవేళ సరైన ఆధారాలు చూపించలేకపోతే లేదా తప్పు వివరాలు ఇస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More