దసరా సందర్భంగా జనాలకు చూపించేందుకు పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఎవరి దృష్టికైనా ఈ విషయం వస్తే.. కచ్చితంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి చెప్పాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో సజ్జనార్ పోస్ట్ చేశారు.

'పండుగ అంటేనే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడం. కానీ, దసరా వేళ శుభం అంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి, బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారు. ఆలోచించండి... ఒక మూగజీవి స్వేచ్ఛను హరించి, దానికి ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ చూస్తే ఎవరికైనా మేలు ఎలా జరుగుతుంది? ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
పాలపిట్ట మన పర్యావరణానికి రక్షకుడు, రైతుకు మేలు చేసే నిజమైన నేస్తం. అది నీలాకాశంలో స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం, మన సమాజానికి గౌరవం. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరం. ఈ పండుగ పూట మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం. బంధించిన పక్షుల ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకండి.
ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించండి.' అని సజ్జనార్ హెచ్చరించారు.
దసరా రోజున సాయంత్రం వేళ శమీ పూజ (జమ్మీ చెట్టు పూజ) ముగించుకున్నాక ఆకాశంలో పాలపిట్టను దర్శిస్తే సకల శని దోషాలు, కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. పాలపిట్ట దర్శనం వల్ల చేపట్టిన ప్రతీ పనిలో విజయం లభిస్తుందని, ఏడాదంతా శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు.
రైతులు పాలపిట్టను తమ మిత్రుడిగా భావిస్తారు. చేనుల్లో ఉండే హానికర పురుగులను ఇది తినడం వల్ల పంటలకు రక్షణ లభిస్తుంది. కాబట్టి పండుగ రోజున ఈ పక్షికి పూజలు చేయడం, దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. పాలపిట్టను చూస్తే విజయాలు వరిస్తాయి అనే నమ్మకంతోనే దసరా వేడుకల్లో భాగంగా జమ్మీ చెట్టు వద్ద పూజలు చేసిన అనంతరం ఆకాశంలో పాలపిట్ట కోసం ఎదురుచూసి దర్శించుకుంటారు. అయితే దీనినే కొందరు సొమ్ముగా చేసుకుంటున్నారు. సిటీలు, కొన్ని ఊర్లకు పాలపిట్టలను బంధించి తీసుకెళ్తున్నారు. పాలపిట్టను చూపించడానికి ఒకరి దగ్గర రూ.20 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా పక్షిని ఇబ్బంది పెడుతున్నారు.
{{/usCountry}}రైతులు పాలపిట్టను తమ మిత్రుడిగా భావిస్తారు. చేనుల్లో ఉండే హానికర పురుగులను ఇది తినడం వల్ల పంటలకు రక్షణ లభిస్తుంది. కాబట్టి పండుగ రోజున ఈ పక్షికి పూజలు చేయడం, దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. పాలపిట్టను చూస్తే విజయాలు వరిస్తాయి అనే నమ్మకంతోనే దసరా వేడుకల్లో భాగంగా జమ్మీ చెట్టు వద్ద పూజలు చేసిన అనంతరం ఆకాశంలో పాలపిట్ట కోసం ఎదురుచూసి దర్శించుకుంటారు. అయితే దీనినే కొందరు సొమ్ముగా చేసుకుంటున్నారు. సిటీలు, కొన్ని ఊర్లకు పాలపిట్టలను బంధించి తీసుకెళ్తున్నారు. పాలపిట్టను చూపించడానికి ఒకరి దగ్గర రూ.20 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా పక్షిని ఇబ్బంది పెడుతున్నారు.
{{/usCountry}}