ఓయూ క్యాంపస్ లో ఇంజినీరింగ్‌ విద్యార్థి సూసైడ్

oఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ లోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Dec 2, 2025, 11:48:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదవుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. విజ్ఞాన్‌ అనే యువకుడు ఆక్సిజన్‌ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఓయూలో విద్యార్థి ఆత్మహత్య..! Representational Image
ఓయూలో విద్యార్థి ఆత్మహత్య..! Representational Image

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఆసుపత్రికి తరలించగా…. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మృతుడి స్వస్థలం హుజూరాబాద్‌గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా… మృతుడు తన స్వగ్రామంలో జరిగిన సంఘటన గురించి ఓ మేసేజ్ ను రాసినట్లు గుర్తించారు. గ్రామంలో జరిగిన ఘటనపై తల్లిదండ్రులు… అతడిని తిట్టినట్లు ఆ సందేశంలో ఉంది. ప్రవర్తనను మార్చుకోకపోతే గ్రామంలో ఉండవద్దని తల్లిదండ్రులు అతనికి చెప్పారని ఆ సందేశంలో రాశాడు. తన కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదని… తాను చనిపోవాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సూసైడ్ తో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థి సూసైడ్ వార్త తెలిసిన వెంటనే పలు విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి ఘర్షణపూరితమైన ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More