రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రేపట్నంచే పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:

పరీక్షల వేళ అధికారులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని చెబుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సకాలంలో రాకుండా చివరి నిమిషంలో వస్తే…. విద్యార్థులు చాలా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
పరీక్షా కేంద్రాన్ని కూడా ముందుగానే చూసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని సెంటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అలర్ట్ చేస్తున్నారు.
గతేడాది మాదిరిగానే ఈసారి పరీక్షల్లో కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉండనుంది. ఈసారి కూడా ఆన్సర్ షీట్ కు ఓఎంఆర్ షీట్ ఉండనుంది. విద్యార్థులు…. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన OMR షీట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలతో పాటు నమూనా మోడల్ ను కూడా అధికారిక వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలుపుతున్నారు.
- ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలవుతుంది. విద్యార్థులను 9.35 వరకు లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతి ఉండదు.
- మొత్తం 2,676 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
- ఎగ్జామ్ సెంటర్ లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మాత్రమే తీసుకెళ్లాలి.
- పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతోపాటు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ చేస్తారు.
- కాపీయింగ్ జరగకుండా 144 ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు సిటింగ్ స్క్వాడ్లను నియమించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ 2026 - షెడ్యూల్
- 14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
- 18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
- 23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
- 28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
- 02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
- 07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
- 13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
- 15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
- 16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్).