...
...
Next Story

'యాప్' ద్వారా యూరియా బుకింగ్ - ముఖ్యమైన విషయాలు

యూరియా ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిల్వ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించకుండా ఆన్​లైన్​లో బుకింగ్​ చేసుకునేలా ‘యూరియా యాప్’ ను రూపొందించింది. ఈ యాప్​ ద్వారానే ఈ యాసంగి సీజన్​కు యూరియా అందించనుంది.

Published on: Dec 21, 2025, 07:24:57 IST
Advertisement

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. సంబంధిత కేంద్రాల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. అయితే కొందరు దళారుల ప్రమేయంలో కృతిమ కొరతను సృష్టించి… రైతులను ఇబ్బందిపడేలా చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్​లైన్​లో బుకింగ్​ చేసుకునేలా ‘యూరియా యాప్’ ను రూపొందించింది. ఈ యాప్​ ద్వారానే ఈ యాసంగి సీజన్​లో రైతులకు యూరియా అందించనుంది.

యూరియా బుకింగ్ యాప్ - ముఖ్యమైన విషయాలు:

  • పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాప్​ ద్వారానే యూరియా బుకింగ్​ చేసుకోవచ్చు. ఇం
  • ఇందుకోసం ప్రతి పర్టిలైజర్​ షాపు వద్ద వలంటీర్​ను ఏర్పాటు చేస్తారు. అవగాహన ఉన్న రైతులు ఇంటి నుంచే యూరియా బుక్​ చేసుకోవచ్చు.
  • సముచితంగా, పారదర్శకంగా యూరియా పంపిణీ చేయటమే ఈ యాప్ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. నిజమైన సాగుదారులకు మాత్రమే యూరియా సరఫరా చేయాలని… సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది.
  • యాప్ లో యూరియా లభ్యత సమాచారం అందుబాటులో ఉంటుంది. సమీప డీలర్ల వద్ద మరియు జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న యూరియా సంచుల వివరాలు చూడొచ్చు.
  • ముందస్తు బుకింగ్ సౌకర్యం ఉంటుంది. అవసరమైన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసి, అనుకూలమైన డీలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
  • బుకింగ్ పూర్తయిన తర్వాత లభించే బుకింగ్ ఐడి చూపించి యూరియా పొందవచ్చు.
  • పంట రకం, సాగు చేసిన విస్తీర్ణం ఆధారంగా యూరియా పరిమాణం స్వయంచాలకంగా లెక్కించబడుతుంది.
  • ఆధార్ ధృవీకరణతో పాటు భూమి యజమాని వివరాలు నమోదు చేసి కౌలుదారు రైతులు కూడా యూరియా బుక్ చేసుకోవచ్చు.
  • సందేహాల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) సహాయం అందిస్తారు. హెల్ప్‌లైన్‌ను కూడా సంప్రదించవచ్చు.

యూరియా బుకింగ్ యాప్
యూరియా బుకింగ్ యాప్
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks