తెలంగాణ రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరల పెరుగుదల గట్టి షాక్ ఇస్తోంది. 2026 అక్టోబర్ నెలలో రాష్ట్రంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) భారీగా పెరిగి 7.26 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ నెలలో 6.64 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, ఒక్క నెలలోనే గణనీయంగా ఎగబాకింది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. వరుసగా 10వ నెలలోనూ జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

2026 క్యాలెండర్ సంవత్సరంలో తెలంగాణ ద్రవ్యోల్బణం 7 శాతం మార్కును దాటడం ఇదే మొదటిసారి. జాతీయ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.54 శాతం ఉండగా, అక్టోబర్‌లో 6.09 శాతానికి చేరింది. కానీ తెలంగాణలో మాత్రం ఇది జాతీయ సగటు కంటే 1.17 శాతం అధికంగా ఉంది.
2026లో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం సాగిన తీరు (నెలవారీ వివరాలు) చూసుకుంటే.. జనవరి-4.92 శాతం, ఫిబ్రవరి-5.02 శాతం, మార్చి-5.83శాతం, ఏప్రిల్-5.81 శాతం, మే-6.15 శాతం, జూన్-6.36శాతం, జూలై-6.32 శాతం, ఆగస్టు-6.27శాతం, సెప్టెంబర్-6.64శాతం, అక్టోబర్-7.26శాతంగా నమోదైంది.
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల సెగ మరింత ఎక్కువగా ఉంది. అక్టోబర్ నెలలో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.68 శాతంగా నమోదు కాగా, గ్రామీణ తెలంగాణలో ఇది ఏకంగా 8.05 శాతానికి చేరుకుంది. జాతీయ స్థాయిలో గ్రామీణ ద్రవ్యోల్బణం 6.63 శాతంగా మాత్రమే ఉండగా, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అంతకంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో మొత్తం ఆరు రాష్ట్రాలు 7 శాతానికి పైగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. ఇందులో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు-7.29 శాతం, తెలంగాణ-7.26 శాతం, ఆంధ్రప్రదేశ్-7.25 శాతం, మధ్యప్రదేశ్-7.19 శాతం, ఒడిశా-7.17 శాతం, కర్ణాటక-7.07శాతంతో ఉన్నాయి.
ఇటీవలి కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడమే ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వ్యవసాయ దిగుబడులు తగ్గడం వల్ల కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం వ్యవసాయ ఉత్పత్తులపై పడటం వల్ల సరఫరా తగ్గి, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
{{/usCountry}}ఇటీవలి కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడమే ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వ్యవసాయ దిగుబడులు తగ్గడం వల్ల కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం వ్యవసాయ ఉత్పత్తులపై పడటం వల్ల సరఫరా తగ్గి, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
{{/usCountry}}ద్రవ్యోల్బణం 7 శాతాన్ని దాటడంతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (గరిష్టంగా 6 శాతం లోపు) పరిమితిలో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.