...
...
Next Story

అక్టోబర్ 1న 2 డీఏలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం.. 15 రోజుల్లోగా పీఆర్‌సీ రిపోర్ట్

దసరా పండుగకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే అక్టోబర్1న జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించనుంది.

Published on: Sep 25, 2026, 11:03:32 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (Dearness Allowance - DA) వాయిదాల విడుదలపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జరిపిన చర్చలు సఫలమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రెండు డీఏల విడుదలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

తెలంగాణలో 2 డీఏలు
తెలంగాణలో 2 డీఏలు

ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల ఆధారంగా, ప్రభుత్వం రెండు విడతల డీఏలను పండుగ కానుకలుగా అందించాలని ప్రణాళిక రూపొందించింది. రాబోయే దసరా పండుగ సందర్భంగా డీఏలు విడుదల చేయనున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా మరో డీఏ మంజూరు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు.

ప్రభుత్వంతో జేఏసీ నాయకులు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సానుకూల నిర్ణయం వెలువడింది. రెండు డీఏల మంజూరుకు హామీ లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన వేతన సవరణ కమిషన్ అంశంపై కూడా ప్రభుత్వం ఉద్యోగ ప్రతినిధులకు స్పష్టమైన హామీ ఇచ్చింది.

తదుపరి 15 రోజుల్లోగా పీఆర్‌సీ నివేదిక ప్రభుత్వాకి అందుతుందని, నివేదిక రాగానే దాని అమలుపై తక్షణ నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అంశాన్ని పరిశీలించడానికి ఒక ప్రత్యేక కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఉద్యోగులు, పింఛనుదారులకు రావాల్సిన దాదాపు రూ. 10,000 కోట్ల పెండింగ్ బకాయిలను మార్చి 2027 నాటికి విడతల వారీగా పూర్తిగా చెల్లిస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి దసరా డీఏ విడుదలతో పాటు పీఆర్‌సీ, పెన్షన్ల బకాయిలపై హామీ లభించడంతో ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో, జేఏసీ నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణను వాయిదా వేశారు. ప్రభుత్వ సానుకూల వైఖరితో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks