ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 14న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతన ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) విధానం, సంక్షేమ పథకాల పరిధి పెంపు, అలాగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై క్యాబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుంది.

నిర్బంధ భూసేకరణ పద్ధతికి స్వస్తి పలుకుతూ, స్థానిక భూ యజమానులకు భాగస్వామ్యం కల్పించేలా కొత్త ల్యాండ్ పూలింగ్ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విధానం కింద భూమి ఇచ్చిన యజమానులకు అభివృద్ధి చేసిన భూమిలో 60 శాతాన్ని తిరిగి కేటాయిస్తారు.
మిగిలిన 40 శాతం భూమిని హెచ్‌ఎండీఏ, టీజీఐసీసీ వంటి ప్రభుత్వ సంస్థలు తమ అధీనంలో ఉంచుకుంటాయి. ప్రభుత్వం తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా నిధులను సమీకరించి, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగిస్తుంది.
లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ ప్రభుత్వం తీర్మానం చేయనుంది. అలాగే రాజ్యసభ, శాసనమండలి స్థానాలకు పోటీ వయస్సును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 10 వరకు లండన్, అమెరికా, చైనా, జర్మనీ దేశాల్లో మూడు వారాల పాటు విదేశీ పర్యటన చేయనున్న దృష్ట్యా ఈ ప్రత్యేక సమావేశాలను ఆగస్టు 17 లేదా 18 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాల పరిధిని పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 41 లక్షల మందికి నెలవారీ పింఛన్లు అందుతుండగా, కొత్తగా మరో 2.25 లక్షల మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేయనున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకాన్ని అదనంగా మరొక 3 నుండి 4 లక్షల కుటుంబాలకు వర్తింపజేయనున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 41 లక్షల మందికి నెలవారీ పింఛన్లు అందుతుండగా, కొత్తగా మరో 2.25 లక్షల మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేయనున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకాన్ని అదనంగా మరొక 3 నుండి 4 లక్షల కుటుంబాలకు వర్తింపజేయనున్నారు.
{{/usCountry}}రూ.500లకే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ఇచ్చే మహాలక్ష్మి పథకం పరిధిలోకి మరో 5 లక్షల కుటుంబాలను తీసుకురానున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో నివసించే అల్పదాయ వర్గాల కోసం ఇందిరమ్మ టవర్స్ పేరిట ప్లాట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవనం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.